Balayya Babu: సినిమా టైటిల్స్ విషయంలో బాలయ్య ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో పాటు బాలకృష్ణ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు సినిమాల టైటిల్స్ కు సంబంధించిన ప్రకటన వస్తుందని అభిమానులు భావించారు.

అయితే బాలయ్య పుట్టినరోజున అప్ డేట్స్ వచ్చినా టైటిల్స్ కు సంబంధించిన ప్రకటనలు మాత్రం వెలువడలేదు. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీకి జై బాలయ్య అనే టైటిల్ ఫిక్స్ అయిందని బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీకి బ్రో ఐ డోంట్ కేర్ టైటిల్ ఫిక్స్ అయిందని బోగట్టా. అయితే ఆలస్యంగా టైటిల్ ను ప్రకటించిన అఖండ సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో బాలయ్య తర్వాత సినిమాల విషయంలో ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు.

సినిమాల రిలీజ్ కు కొన్నిరోజుల ముందు బాలయ్య కొత్త సినిమాల టైటిల్స్ కు సంబంధించిన ప్రకటనలు వెలువడే ఛాన్స్ అయితే ఉందని అప్పటివరకు బాలయ్య అభిమానులకు ఎదురుచూపులు తప్పవని తెలుస్తోంది. మరోవైపు బాలయ్య అనిల్ కాంబో మూవీకి దిల్ రాజు సహనిర్మాతగా వ్యవహరిస్తారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ వార్తలకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. అనిల్ రావిపూడి దిల్ రాజు కాంబినేషన్ లో తెరకెక్కి విడుదలైన ఎఫ్3 సినిమాకు పాజిటివ్ టాక్

వచ్చినా రిలీజ్ డేట్ విషయంలో చేసిన తప్పు వల్ల ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. బాలయ్య గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ సినిమాలు విడుదలైన తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus