Balakrishna, Vijayashanthi: ‘ నిప్పురవ్వ ’ టైంలో బాలకృష్ణ – విజయశాంతి ల మధ్య ఏం జరిగిందంటే..!

తెలుగు తెరపై హిట్ పెయిర్ అనిపించుకున్న హీరో హీరోయిన్లు ఎందరో వున్నారు. అలాంటి వారిలో ఒక జంట.. నందమూరి బాలకృష్ణ-విజయశాంతి. 80వ దశకంలో వీరిద్దరూ హల్‌చల్ చేశారు. దాదాపు 17 చిత్రాల్లో జోడిగా నటించి నిర్మాతలకు లాభాల పంట పండించారు. 1986లో వీరిద్దరూ మూడు సినిమాలలో కలిసి నటించి అలరించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి సినిమా నిప్పురవ్వ. అయితే ఇంతటి హిట్‌పెయిర్ ఒక్కసారిగా కలిసి నటించడం మానేయడంతో సహజంగానే ప్రేక్షకులతో పాటు సినీ జనాలు కూడా నానా రకాలుగా అనుకుంటారు. అదే అప్పుడూ జరిగింది.

నిప్పు రవ్వ షూటింగ్ సమయంలో బాలయ్య- విజయశాంతి మధ్య విభేదాలు వచ్చాయని అందుకే కలిసి నటించడం లేదని పుకార్లు షికార్లు చేశాయి. అది కూడా మూడు దశాబ్ధాల పాటు అలా వార్తలు వస్తూనే వున్నాయి.దీనిని ఇలాగే వదిలేస్తే లాభం లేదని భావించిన విజయశాంతి గాసిప్ రాయుళ్ల నోరు మూయించాలని డిసైడ్ అయ్యారు. దీనిలో భాగంగా బాలయ్యతో తాను నటించకపోవడం వెనుక గల కారణాన్ని చెప్పారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన రాములమ్మ..

నిప్పురవ్వ చిత్రం తర్వాత తన రెమ్యూనరేషన్ పెరిగిందని, అలాగే ఇమేజ్ కూడా పెరిగిందని చెప్పారు. దీంతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలపైన ఫోకస్ చేశానని అందుకే మళ్లీ బాలయ్యతో కాంబినేషన్ సెట్ కాలేదని విజయశాంతి వెల్లడించారు. అంతేతప్ప ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు చోటు చేసుకోలేదని రాములమ్మ క్లారిటీ ఇచ్చారు. సో.. అదన్న మాట మేటర్.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus