కొత్త ‘ఖుషి’ కూడా టైం ట్రావెల్ కథాంశమేనా…..?

విజయ్ దేవరకొండ .. వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు.’డియర్ కామ్రేడ్’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ‘లైగర్’ వంటి చిత్రాన్ని అతన్ని అమాంతం కిందకి లాగేశాయి. ఇప్పుడు అర్జెంట్ గా అతనికో హిట్టు కావాలి. అందుకే ‘ఖుషి’ అనే సినిమా చేస్తున్నాడు. వరుస హిట్లతో ఫామ్లో ఉన్న సమంత హీరోయిన్ గా, అలాగే మంచి ఫామ్లో ఉన్న ‘మైత్రి’ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి చిత్రాలతో సూపర్ హిట్లు అందుకున్న శివ నిర్వాణ దర్శకుడు..

సమంతకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈ చిత్రం షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. మధ్యలో సమంత ఈ చిత్రం నుండి తప్పుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ తర్వాత అవన్నీ అవాస్తవాలు అని ఆమె క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్యనే ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభమైంది.తాజాగా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ ను వదిలారు. సెప్టెంబర్ 1న ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

పోస్టర్ పై రెండు ప్రపంచాలని రాసుకొచ్చారు. దీంతో ఈ చిత్రం టైం ట్రావెలర్ కథాంశంతో రూపొందుతోందని, అద్భుతం సినిమాతో పోలికలు ఉంటాయని అంతా అంటున్నారు. అయితే ఇది దేవుడు అంటే నమ్మకం ఉన్న వ్యక్తి, దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తిని ప్రేమించి పెళ్లాడితే ఎలా ఉంటుంది అనే పాయింట్ తో శివ నిర్వాణ స్టైల్లో చాలా సెన్సిబుల్ గా రూపొందుతుందని తెలుస్తుంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus