Naga Chaitanya Tattoo: చైతన్య టాటూ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలలో ఒకరైన నాగచైతన్యకు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. జయాపజయాలతో సంబంధం లేకుండా నాగచైతన్య కెరీర్ ను కొనసాగిస్తున్నారనే సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో చైతన్య నటించిన లాల్ సింగ్ చద్దా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చైతన్య మాట్లాడుతూ చేతి మణికట్టు దగ్గర మాత్రమే నాకు పచ్చబొట్టు ఉంటుందని అన్నారు.

ఆ పచ్చబొట్టు అంటే నాకు ఎంతో ఇష్టమని చైతన్య చెప్పుకొచ్చారు. సమంతతో పెళ్లి జరిగిన తేదీని నేను పచ్చబొట్టుగా పొడిపించుకున్నానని చైతన్య అన్నారు. ఆ పచ్చబొట్టును చూసేవాళ్లకు అది తేదీలా కనిపించదని చైతన్య కామెంట్లు చేశారు. అందువల్ల నా ఫ్యాన్స్ చాలామంది ఆ పచ్చబొట్టును కాపీ కొడుతున్నారని చైతన్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఫ్యాన్స్ కు ఒక విషయం చెప్పాలనుకున్నానని చైతన్య అన్నారు.

నా ఫ్యాన్స్ టాటూ విషయంలో మాత్రం నన్ను ఫాలో కావద్దని చైతన్య పేర్కొన్నారు. ఎందుకంటే ఆ టాటూ నా మ్యారేజ్ డేట్ అని చైతన్య వెల్లడించారు. ఆ పచ్చబొట్టును మార్చుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదని చైతన్య అన్నారు. పచ్చబొట్టు గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదని చైతన్య కామెంట్లు చేశారు. ఈ టాటూ ఉండటం వల్ల నాకెప్పుడూ ఇబ్బంది కలగలేదని చైతన్య చెప్పుకొచ్చారు.

ప్రస్తుతానికి నేను హ్యాపీగానే ఉన్నానని చైతన్య కామెంట్లు చేశారు. ఇప్పుడు నాకు సమంత ఎదురైతే హాయ్ చెప్పి ఆలింగనం చేసుకుంటానని చైతన్య కామెంట్లు చేశారు. 2017 సంవత్సరం అక్టోబర్ 6వ తేదీన చైతన్య సమంతల వివాహం జరిగింది. గతేడాది అక్టోబర్ 2వ తేదీన చైతన్య సమంత విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సమంత విషయంలో చైతన్య పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు. చైతన్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus