బోనీకపూర్ సీరియస్ అవ్వాల్సిన సీన్ ఉందా..?

RRR రిలీజ్ డేట్ ని అనైతిక చర్యగా పేర్కొంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నిర్మాత బోనీకపూర్. ఈ న్యూస్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అసలు ఈ సమస్య ఎందుకొచ్చింది. నిజంగానే రాజమౌళి మిస్టేక్ ఉందా అనేది చాలామందికి అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అయితే, నిజానికి అసలు ఏం జరిగింది ఎందుకు రాజమౌళి మాటలని బోనీకపూర్ నమ్మడం లేదనేది ఇంట్రస్టింగ్ టాపిక్. రీసంట్ గా ఇంగ్లీష్ మ్యాగ్జైన్ కి ఇచ్చిన ఇంటర్య్వులో రాజమౌళి తనకి ఏం చెప్పాడో అసలు కారణాన్ని వివరించాడు. కానీ, అది తను నమ్మడం లేదని చెప్పాడు.

రీసంట్ గా బోనీకపూర్ రాజమౌళితో ఫోన్‌లో మాట్లాడారట. రిలీజ్ డేట్ విషయం అనేది తనకి సంబంధం లేదని, అది నిర్మాతల ఇష్ట ప్రకారం జరిగిందని రాజమౌళిగారు చెప్పారని, కానీ, ఆయన మాటల్ని నేను నమ్మాలని అవుకోవడం లేదని అన్నారు. ఎందుకంటే ట్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ డేట్ విషయంలో అజయ్ దేవగన్ కి కూడా క్లారిటీ లేదని, ప్రొడ్యూసర్స్ కి తెలిసి ఉంటే ముందే చెప్పేవారని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరున్న రాజమౌళి నుంచి నేను ఇలాంటి చర్య ఊహించలేదని ఈ ఇంటర్య్వూలో చెప్పాడు.

అసలు ట్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ కి, అజయ్ దేవగన్ నటించిన మైదాన్ సినిమాకి సంబంధం ఏంటి అనేది నెటిజన్స్ అడుగుతున్న ప్రశ్న. ఒకే హీరోకి చెందిన రెండు సినిమాలు భారీ ప్రాజెక్ట్స్ రెండు రోజులు తేడాలో రావడం అనేది కరెక్ట్ కాదని బోనీకపూర్ వాదన. నిజానికి మనం చూసినట్లయితే ట్రిబుల్ ఆర్ సినిమాకి హీరోలు ఇద్దరు. ఒకరు జూనియర్ ఎన్టీఆర్ ఇంకొకరు రామ్ చరణ్. వీరిద్దరిపైనే సినిమా మొత్తం తిరుగుతుంది. ఇందులో అజయ్ దేవగన్ రోల్ ఎంతవరకూ ఉంటుంది..? అలియాభట్ క్యారెక్టర్ నిడివి ఎంత అనేది ఎవ్వరికీ తెలియదు. అలాంటపుడు అజయ్ దేవగన్ కేవలం ఈసినిమాలో ఉన్నాడని భారీ ప్యాన్ ఇండియన్ మూవీని రిలీజ్ చేయకుండా ఎలా ఉంటారు.

పైగా, ఇది సౌత్ నుంచి వచ్చే సినిమా నార్త్ లో మార్కెట్ అనేది రాజమౌళికి ఎక్కువ. ఇది ఏమాత్రం మైదాన్ మీద ప్రభావాన్ని చూపించదు. నిజంగా సినిమాలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతాయి. కలక్షన్స్ వస్తాయి. గతంలో కూడా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యాయి కూడా. ఒకవైపు మల్టీస్టారర్ సినిమా వచ్చినా, ఆ హీరోది స్ట్రయిట్ సినిమా మరొకటి ఉండేది. దీనికి బోనీకపూర్ సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదని పిచ్చలైట్ తీస్కునే విషయం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై స్టార్ డైరెక్టర్ ని నిందించడం అనేది కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. అదీ మేటర్.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus