గత వీకెండ్ కు ‘విరూపాక్ష’ సినిమా రిలీజ్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకుడు. ‘ఎస్వీసిసి బ్యానర్’ బ్యానర్ పై బాపినీడు, భోగవల్లి ప్రసాద్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి. వీకెండ్ కే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కు చేరువైంది అని చెప్పాలి.
సాయి ధరమ్ తేజ్ (Virupaksha) కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇవి. సోమవారం రోజు కూడా బుకింగ్స్ బాగున్నాయి. ప్రమోషన్స్ లో అజయ్ చెప్పినట్టు.. ‘ఓ వరల్డ్ క్రియేట్ చేసి.. అందుకు తగ్గట్టు పాత్రలు డిజైన్ చేసి.. వాటిని జనాల్లోకి తీసుకెళ్లగలిగితే సినిమా బ్లాక్ బస్టర్’ అవుతుంది. ఈ విషయాన్ని ‘విరూపాక్ష’ ప్రూవ్ చేసింది. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ చాలా బాగుంది. అందుకే జనాలు ఎగబడి ఈ చిత్రాన్ని చూస్తున్నారు.
అయితే కొద్దిరోజుల ముందు వచ్చిన రవితేజ ‘రావణాసుర’ చిత్రానికి అలాంటిదేమీ చిత్ర బృందం చేయలేదు. రవితేజ నటించిన ఈ సినిమాకి ప్రమోషన్స్ చేశారు.. కానీ అన్ని వేడుకల్లో నటీనటులు కానీ, నిర్మాతలు కానీ, దర్శకుడు కానీ.. సినిమా థీమ్ ఇది.. అని చెప్పారు కానీ జనాలకు ఇంట్రెస్ట్ కలిగేలా కంటెంట్ గురించి చెప్పలేదు. ఎవరినడిగినా.. ‘మీరు థియేటర్లోనే చూడాలి’ అంటూ దాటేసారు. అంతా పోసి సినిమాలో ఏమైనా ఉందా అంటే అదేమీ లేదు.
బెంగాలీ సినిమా ‘విన్సిడా’ ని అటు తిప్పి ఇటు తిప్పి వడ్డించారు. ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రమే వచ్చాయి. సినిమా ప్లాప్ అయ్యింది. థ్రిల్లర్ సినిమాకి ప్రమోషన్స్ ఎలా చెయ్యాలి.. ఎలా చేయకూడదు అని చెప్పడానికి ‘రావణాసుర’ ‘విరూపాక్ష’ చిత్రాలను బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?