Ravi Teja, Gopichand Malineni: మళ్లీ రవితేజ వద్దకే గోపీచంద్.. కారణం అదే!

మినిమమ్ గ్యారెంటీ సినిమాలు అందిస్తాడు అని దర్శకుడు గోపీచంద్ మలినేని పై మంచి పేరు ఉంది. ఈ సంక్రాంతికి అతను వీరసింహారెడ్డి వంటి సూపర్ హిట్ అందించాడు. అంతకు ముందు కూడా క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ అతని పేరు పై రిజిస్టర్ అయ్యింది. దీంతో స్టార్ హీరోలతో అతని నెక్స్ట్ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరిగాయి. వీరసింహారెడ్డి టైంలోనే మహేష్ బాబుకి కథ చెప్పడం జరిగింది.

మైత్రి వారితోనే గోపీచంద్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయాలి. మహేష్ వద్ద కూడా మైత్రి వారి అడ్వాన్స్ ఉంది. కానీ మహేష్ కాల్ షీట్స్ ఇప్పట్లో ఖాళీ లేవు. దీంతో తమిళ స్టార్ విజయ్ ను ట్రై చేశాడు గోపీచంద్. అతని వద్ద కూడా మైత్రి వారి అడ్వాన్స్ ఉంది. ఎందుకో అతను కూడా ఒప్పుకోలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ రవితేజనే దిక్కయ్యాడు. అవును గోపీచంద్ మలినేని నెక్స్ట్ మూవీ (Ravi Teja) రవితేజతో ఫిక్స్ అయ్యింది.

మైత్రి వారే ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు. ఈరోజు అధికారిక ప్రకటన ఇచ్చారు మైత్రి వారు.రవితేజ – గోపీచంద్ ..లది సూపర్ హిట్ కాంబినేషన్. డాన్ శీను, బలుపు, క్రాక్ .. ఇలా వీరి కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు హిట్లే.పైగా వీళ్ళ కాంబో పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. మరి వీరి కాంబోలో వచ్చే నాలుగో సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో చూడాలి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus