సినిమా ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసే టీజర్, ట్రైలర్లు మాత్రమే కాదు.. షూటింగ్ మొదలైన కొద్ది రోజుల్లోనే విడుదల చేసే ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ (Glimpse) వంటివి కూడా.. చాలా కీలకం అయిపోయాయి. అభిమానుల పోరు పడలేకే వీటిని రిలీజ్ చేస్తూ ఉంటాం అంటూ దర్శక నిర్మాతలు చెబుతూ ఉంటారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వంటి వాటిల్లో రిలీజ్ డేట్లు కూడా పెడుతుంటారు మేకర్స్. ఇవి నిజమే అని అంతా నమ్మేస్తారు. కానీ కట్ చేస్తే.. అనౌన్స్మెంట్ ఇచ్చిన డేట్ కి అవి రావు.
‘సాంకేతిక కారణాల వల్ల లేదా ఇతర కారణాల వల్ల .. అనుకున్న డేట్ కి రాలేకపోతున్నాం’ అంటూ క్షమాపణలు చెబుతూ చివర్లో ఒక ప్రెస్ నోట్ వదులుతారు. ఆడియన్స్ వాటిలో కన్విన్స్ అయ్యి.. విషయాన్ని మర్చిపోతారు. అభిమానులు కూడా అంతే..! కానీ సినిమాలు అనౌన్స్ చేసిన డేట్ కి రావు అని మేకర్స్ కి మాత్రమే కాదు.. ఆడియన్స్ కూడా ఒక అభిప్రాయానికి వచ్చేశారు అని చెప్పాలి. ఆడియన్స్, ఫ్యాన్స్ సంగతి పక్కన పెట్టేస్తే..
మేకర్స్ ఇలా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం వెనుక ఒక కారణం ఉంది. అదేంటో ఈ పాటికే కొందరు అంచనా వేసేసి ఉంటారు. విషయం ఏంటంటే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం వల్ల.. సినిమాకి బిజినెస్ ఆఫర్స్ బాగా వస్తాయి. అయితే అది గ్లింప్స్ (Glimpse) లేదా ఫస్ట్ లుక్ పోస్టర్ బజ్ ను క్రియేట్ చేస్తే మాత్రమే..! రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు అంటే..
ఓటీటీ సంస్థలు లేదంటే కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమా రైట్స్ కోసం ఎగబడుతూ ఉంటారు. అలా గట్టిగా అమౌంట్ వస్తే… వాటితోనే నిర్మాత సినిమాని కంప్లీట్ చేస్తాడు. ఒకవేళ క్రియేట్ అవ్వక ఎవ్వరూ… ఆ సినిమా రైట్స్ ను కొనడానికి ముందుకు రాకపోతే.. ఉన్న డబ్బుతో అలాగే అప్పులు తెచ్చుకొని సినిమాని షూటింగ్ ను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అది అసలు మేటర్..!