Samantha: దర్శకనిర్మాతలతో సమంతకి క్రియేటివ్ డిఫరెన్సెస్.. అందుకే ఆ ప్రాజెక్టు వదులుకుందా!

తమిళంలో అగ్ర నిర్మాణ సంస్థగా దూసుకుపోతున్న ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ సంస్థ..’ ఒకే ఒక జీవితం’ చిత్రంతో టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే మంచి విజయాన్ని అందుకోవడంతో.. ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ తెలుగు ప్రేక్షకుల మైండ్లో కూడా రిజిస్టర్ అయ్యిందని చెప్పొచ్చు. ఇదే జోష్ తో తెలుగులో మరో సినిమాని అనౌన్స్ చేశారు. సమంత ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు. కానీ ఏమైందో ఏమో ఈ ప్రాజెక్టు నుండి సమంత తప్పుకోవడం..

రష్మిక వచ్చి చేరడం జరిగింది. ‘రెయిన్‌బో’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ సంస్థ పై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తుండగా శాంతరూబన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. నిన్న హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది ఈ చిత్రం. అయితే ఈ చిత్రం సమంతతో కాకుండా రష్మికతో ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న దర్శకనిర్మాతలకు ఎదురైంది.

దానికి వారు ‘అన్నీ అనుకున్నట్టు జరగలేదు కానీ రైట్ టైంలో రైట్ పర్సన్ తో ప్రాజెక్టు చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంది’ అంటూ వారు సమాధానం ఇచ్చారు. దీంతో అంటే ‘సమంత రైట్ పర్సన్ కాదా.. దర్శకనిర్మాతలతో సమంతకి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా’ అనే గుసగుసలు మొదలయ్యాయి. అయితే అసలు మేటర్ వేరు. సమంతతో ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేశాక…

ఆమె (Samantha) హెల్త్ అప్సెట్ అవ్వడం జరిగింది. మరోపక్క ఆమె ‘రెయిన్ బో’ కి ముందు ఒప్పుకున్న ప్రాజెక్టులు కూడా పెండింగ్లో పడ్డాయి. అవి కంప్లీట్ చేసే సరికి ఇంకా టైం పడుతుంది కాబట్టి.. రష్మిక తో ముందుకెళ్తున్నారు ‘రెయిన్ బో’ మేకర్స్.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus