Samyuktha Menon: సంయుక్త వీపు పై ఉన్న టాటూకి అంత మీనింగ్ ఉందా?

సంయుక్త మీనన్..కొద్దిరోజులుగా ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.ఈమెకు ‘గోల్డెన్ లెగ్’ అనే ట్యాగ్ కూడా ఇచ్చేస్తున్నారు ప్రేక్షకులు. ‘భీమ్లా నాయక్’ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ కు చెల్లెలు లాంటి పాత్రలో.. రానాకి భార్య పాత్రలో.. నెలలు నిండిన గృహిణిగా చాలా చక్కగా నటించి మెప్పించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఈమె నటన సూపర్ అనే చెప్పాలి. అటు తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘బింబిసార’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది.

ఆ సినిమాలో ఆమె పాత్ర అంతంత మాత్రమే అయినప్పటికీ.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం వల్ల.. సంయుక్త టాలీవుడ్ కు గోల్డెన్ లెగ్ అనే టాక్ మొదలవ్వడానికి కారణమైందని చెప్పాలి. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన ధనుష్ ద్విభాషా చిత్రం ‘సార్’ తో ఈమె టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. లేటెస్ట్ గా వచ్చిన ‘విరూపాక్ష’ మూవీ సూపర్ సక్సెస్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయిందని చెప్పాలి.

ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో (Samyuktha Menon) సంయుక్త మీనన్ గ్లామర్ షో కూడా పెంచినట్టు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈమె గ్లామర్ ఫోటోలు అందుకు ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు.అయితే ఈ ఫొటోల్లో ఆమె టాటూ హైలెట్ గా నిలుస్తుంది అని చెప్పాలి. సంయుక్త వీపు పై మలయాళంలో ఏదో రాసుంది. అదేంటి.. అనే డిస్కషన్లు కూడా మొదలయ్యాయి.

ఆ టాటూకి మీనింగ్ ‘సంచారి’ అట. ఈమె సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు.. అవకాశాలు రావడం ఆలస్యమైతే 8 రోజులు ఒంటరిగా ట్రిప్ లకు వెళ్ళొచ్చిందట. అందుకే ‘సంచారి’ అని టాటూ వేయించుకుందట.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus