టాలీవుడ్ డైరక్టర్లలో సుకుమార్ కానీ, ఆయన టేకింగ్ కానీ, రైటింగ్ కానీ చాలా టిపికల్. సగటు టాలీవుడ్ డైరక్టర్ స్టైల్‌లో ఆయన ఆలోచించరు, రాయరు, తీయరు కూడా. తాజాగా ఆయన రైటింగ్ వెనుక ఉన్న ఓ సీక్రెట్‌ను బయటకు చెప్పారని టాక్. ఆయన డైలగ్స్, ఆయన హీరోల మేనరిజమ్స్ ఎందుకు అంత హిట్ అవుతాయి అనే విషయంలో ఉన్న కిటుకును ఆయన వివరించారు. దీంతో ‘ఒహో లెక్కల మాస్టారి లెక్క ఇదా?’ అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
రీసెంట్‌గా సుకుమార్ నుండి వచ్చిన ‘పుష్ప’ సినిమా చూస్తే ఈ విషయం క్లియర్‌గా తెలిసిపోతుంది. టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో ‘పుష్ప’రాజ్ లాంటి క్యారెక్టర్‌లు కొన్ని వచ్చాయి. కానీ వాటిలో పుష్పరాజ్ ఎందుకు అంత ప్రత్యేకంగా నిలిచాడు అంటే సినిమాలో అతను చూపించే యాటిట్యూడ్, అతనికున్న డైలాగ్‌లే. సినిమా విడుదలయ్యాక ఎంతమంది ఫ్యాన్స్, సెలబ్రిటీలు పుష్పరాజ్‌ను ఇమిటేట్ చేశారో లెక్కేయడం కష్టం. క్రికెట్ గ్రౌండ్‌లో ఆ టైమ్‌లో పుష్పరాజ్‌లు చాలామంది కనిపించారు.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన సుకుమార్ 20 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నారు, సినిమా సినిమాకు తనలో మార్పు కనిపిస్తూనే ఉంది. ఆయన సినిమాలు ఔట్ డేటడ్ అని ఎక్కడా అనిపించవు. దానికి కారణం ఆయన చుట్టూ ఉన్న టీమ్, ఆయన ఆలోచనలే. సోషల్ మీడియా యుగంతో వాటికి తగ్గట్టుగా మనం ఉండాలి, మన సినిమాలు ఉండాలి అని ఆయన అనుకోవడమే ఆయన సినిమాల అప్‌డేషన్‌కి కారనం అని అంటున్నారు. సుకుమార్ అందుకే ఇప్పటికీ ట్రెండీగానే సినిమాలు తీస్తున్నారట.
ఇప్పటికీ యువతకు ఆయన సినిమాలు బాగా కనెక్ట్ అవ్వడానికి ఆయన సోషల్ మీడియాలో బాగా వెళ్తాయి అనుకునే మేనరిజమ్స్, డైలాగ్స్‌తో సినిమాను నింపేయడమే అంటున్నారు. సుకుమార్ సినిమాల్లోని ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవ్వడానికి అదే కారణమట. అంటే సోషల్ మీడియాలో ఈ మేనరిజమ్, డైలాగ్ బాగా వెళ్తుందని ముందుగా అనుకుని రాసుకోవడం, సిద్ధం చేయడం లాంటివి చేస్తుంటారట. దీంతో స్టిల్ సుకుమార్ యంగ్ ఇన్ మైండ్ అంటున్నారు.