విజయ్ సేతుపతికి (Vijay Sethupathi) విలన్ రోల్స్ చేసి చేసి విరక్తి వచ్చేసినట్టు ఉంది. అందుకే హీరోగా బిజీ అవ్వాలి అనుకుంటున్నాడు. ‘మహారాజ’ (Maharaja) మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.200 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. దీంతో విజయ్ సేతుపతి హీరోగా చేసే సినిమాలపై కూడా డిస్ట్రిబ్యూటర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత వచ్చిన ‘విడుదలై 2’ (Vidudala 2) కూడా తమిళంలో బాగానే కలెక్ట్ చేసింది. ఓ పక్క తమిళంలో హీరోగా సినిమాలు చేస్తూనే హిందీలో కూడా పలు వెబ్ సిరీస్ లలో హీరోగా, సినిమాల్లో సెకండ్ హీరో తరహా రోల్స్ ఒప్పుకుంటున్నాడు విజయ్ సేతుపతి.
సో అతని కెరీర్ పీక్స్ లో ఉన్నట్టే. ఇలాంటి టైంలో విజయ్ సేతుపతి.. టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తో (Puri Jagannadh) సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. పూరీ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు (ఇస్మార్ట్ శంకర్ ( iSmart Shankar) తప్ప) అన్నీ డిజాస్టర్లే.అతనితో సినిమాలు చేయడానికి.. కాదు కాదు కనీసం అతని కథలు వినడానికి కూడా టాలీవుడ్ హీరోలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఆఖరికి ప్లాపుల్లో ఉన్న గోపీచంద్ (Gopichand), నాగార్జున (Nagarjuna) వంటి వారు కూడా మొహం చాటేశారు.
అయినా సరే విజయ్ సేతుపతిని (Vijay Sethupathi) హీరోగా పెట్టి ఓ సినిమా చేయడానికి పూరీ రెడీ అయిపోయాడు. అసలు విజయ్ సేతుపతి ఎందుకు పూరీ వంటి ప్లాప్ దర్శకుడితో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అయితే కోలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్టు కోసం విజయ్ సేతుపతికి రూ.20 కోట్లు పారితోషికం ఆఫర్ చేశారట పూరీ, ఛార్మీ (Charmy Kaur). బహుశా అందుకే సినిమాకి ఓకే చెప్పేశాడేమో అనేది తమిళ జనాల అభిప్రాయం. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.