సడెన్ గా ఎందుకిలా జరిగింది..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే న్యూస్ చెప్పాడు. దిల్ రాజు బ్యానర్ లో తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమా ఎనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. గతంలో భారతీయుడు 2 సినిమా చేయడానికి శంకర్ తో కమిట్ అయ్యాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. కానీ, కొన్ని కారణాలవల్ల అది చేతులు మారిపోయింది. ఇప్పుడు ఎట్టిపరిస్థితుల్లో శంకర్ సినిమా చేయాల్సి వచ్చింది. దీనికోసం రామ్ చరణ్ డేట్స్ ని ఎడ్జెస్ట్ చేస్కుని మరీ ఇప్పుడు సినిమాని ఎనౌన్స్ చేశారు.

నిజానికి గతంలో రోబో ఆడియో లాంఛ్ అప్పుడు మెగాస్టార్ చిరంజీవి శంకర్ తో సినిమా చేయడం అనేది తన డ్రీమ్ అని చెప్పాడు. కానీ, అప్పుడు శంకర్ పెదవి విప్పలేదు. యస్ అని చెప్పలేదు.. నో అని చెప్పలేదు. ఆ తర్వాత మెగాస్టార్ రాజకీయాల్లో బిజీ అయిపోవడం, మళ్లీ తిరిగి ఖైదీ నెంబర్ 150 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు రామ్ చరణ్ తో పోలిస్తే మెగాస్టార్ చిరంజీవి మంచి ఫామ్ లో ఉన్నాడు. సైరాతో పాన్ ఇండియా మార్కెట్ ని సంపాదించాడు.

అలాంటిది అప్పుడు చిరంజీవి కి నో చెప్పి, ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమాకి సై అన్నాడు డైరెక్టర్ శంకర్. సడన్ గా ఎందుకిలా జరిగిందా అని ఆరాలు తీస్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. మరి వీరిద్దరి సినిమా ఏ జోనర్లో ఉండబోతోందనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పక్కా కమర్షియల్ యాక్షన్ మూవీగానే ఇది ఉంటుందని , శంకర్ స్టైల్లో సోషల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి తండ్రికి హ్యాండ్ ఇచ్చి కొడుకుతో సినిమా చేస్తున్నారు శంకర్. అదీ మేటర్.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus