Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఈ పేరు ఎందుకు వద్దన్నాడంటే..!

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోతో అనుకున్న కథ మరో హీరో దగ్గరకి వెళ్లడం.. కన్ఫమ్ అయిన తర్వాత కూడా ప్రాజెక్టులు దర్శక నిర్మాతల చేతులు మారడం.. కొంత షూటింగ్ జరిగిన చిత్రాలు మధ్యలోనే ఆగిపోవడం.. పూర్తి అయిన సినిమాలు విడుదల కాకపోవడం లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అలాంటిది కేవలం టైటిల్ మార్చడం అనేది పెద్ద విషయమేమీ కాదు..అయితే ఆఫ్ స్క్రీన్ జరిగే ఆసక్తికరమైన సంగతులు తెలుసుకోవడానికి ఆడియన్స్, మూవీ లవర్స్ ఎప్పుడూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

పైగా ఆ క్రేజీ న్యూస్ ఏ స్టార్ హీరోదో కనుక అయితే ఆటోమేటిగ్గా ఆసక్తి అనేది కలుగుతుంది. అలా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఓ సినిమా టైటిల్ మార్పు, దాని వెనుక జరిగిన మేటర్ ఏంటనేది చూద్దాం.. ‘ఖుషి’ చిత్రం పవన్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ.. యూత్‌లో ఆయన క్రేజ్‌ని డబుల్ చెయ్యడమే కాకుండా.. ఇండస్ట్రీ హిట్ రేంజ్ వసూళ్లు రాబట్టింది. ఎస్.జె.సూర్య డైరెక్టర్‌గా పరిచయమైన ఈ మూవీకి ముందుగా ‘చెప్పాలని వుంది’ అనే టైటిల్ అనుకున్నారు.

యువతకి దగ్గరయ్యే అన్ని అంశాలూ ఉన్నాయి కాబట్టి పేరు కూడా క్యాచీగా ఉండాలని పవన్ సలహా ఇచ్చారట. దీంతో యూనిట్ అంతా చర్చించుకుని ‘ఖుషి’ టైటిల్ అనుకున్నారట. పవన్‌కి కూడా పేరు నచ్చడంతో ‘ఖుషి’ కన్ఫమ్ అయిపోయింది. తర్వాత అదే ‘చెప్పాలని వుంది’ టైటిల్‌కి ‘టు ఎక్స్‌ప్రెస్ లవ్’ అనే ట్యాగ్ జతచేసి.. వడ్డే నవీన్, రాశి నటించిన సినిమాకి పెట్టారు. ‘ప్రేయసిరావే’ ఫేమ్ చంద్రమహేష్ ఈ మూవీకి దర్శకుడు..

పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమా పేరు ఇదే అని అప్పటికే టైటిల్ పాపులర్ అయింది. కానీ పేరుకి వచ్చినంత పాజిటివ్ టాక్ ఈ ‘చెప్పాలని వుంది’ కి రాలేదు. హైలెట్ ఏంటంటే ఈ రెండు చిత్రాలకూ సంగీతమందించింది మణిశర్మనే. ‘ఖుషి’ ఆల్బమ్ చార్ట్ బస్టర్‌గా నిలిస్తే.. ఇందులో సాంగ్స్ పర్వాలేదనిపించాయి..

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus