Pawan Kalyan Wife: ఆ కారణంగానే అన్నా లెజినావా రాలేకపోయిందా?

ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న విషయం వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం. సుమారుగా 7 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటూ డేటింగ్ చేస్తూ వచ్చిన ఈ జంట, అతి త్వరలోనే మూడు ముళ్ల బంధం తో ఒకటి కానున్నారు. ప్రస్తుతం ఈ జంట హాలిడే ట్రిప్ కోసం విదేశాల్లో చెట్టపట్టాలు వేసుకుంటూ తిరుగుతున్నారు. ఇదంతా పక్కన పెడితే మొన్న జరిగిన నిశ్చితార్థం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఆయన ఆరోజు వేసుకొచ్చిన దుస్తులు, మరియు ఆయన స్టైలింగ్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ నిశ్చితార్థం మెగా కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ సతీసమేతంగా హాజరయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఒంటరిగా హాజరయ్యాడు, దీనిపై సోషల్ మీడియా లో పెద్ద రచ్చే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ మరియు అన్నా లెజినావా గత కొంత కాలం గా దూరంగా ఉంటూ వస్తున్నారని. వాళ్లిద్దరూ కలిసి లేరని, పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఉండే ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియా లో రచ్చ చెయ్యడం ప్రారంభించాయి.

అయితే ఆరోజు అన్నా లెజినావా ఫంక్షన్ కి రాలేకపోవడానికి ఒక కారణం ఉంది. ఆమె ఆరు నెల నుండి ఇండియా లో లేదు, రష్యా లో తన తల్లి తండ్రుల కోసం వెళ్ళింది. గత కొంతకాలం గా అన్నా తల్లికి ఆరోగ్య పరంగా అస్వస్థత ఏర్పడింది.అందువల్లే ఆమె రష్యా కి పయనం అయ్యింది. అన్నా లెజినావా ని మరియు తన పిల్లలను విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ ఆరు నెలల క్రితం పంపిస్తున్న వీడియో ని మీరు క్రింద చూడవచ్చు. అయితే అన్నా లెజినావా నిశ్చితార్థం కి రాలేకపోయినా కూడా, వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి కి తన తరుపున విషెస్ చెప్తూ (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ ఇచ్చిన బొకే లో ‘పవన్ కళ్యాణ్ – అన్నా’ అని ఉండడాన్ని మనం గమనించొచ్చు.

కనీసం అది చూసి కూడా అర్థం చేసుకోలేకపోయాయి ప్రతిపక్ష పార్టీలు. ఒకవేళ వాళ్లిద్దరూ నిజంగా మాట్లాడుకోకుండా దూరంగా ఉంటుంటే పవన్ కళ్యాణ్ ఆమె పేరు ని ఎందుకు రాస్తాడు అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు అంటూ సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus