Ravi Teja: ‘ఖిలాడి’ ప్రమోషన్స్ కు దూరంగా రవితేజ…తెగేసి చెప్పేశాడట..!

ఓ సినిమా విడుదలయ్యాక సక్సెస్ మీట్ లు వంటివి పెట్టుకోవడం ఈ రోజుల్లో బాగా కామన్.తద్వారా తమ సినిమాని చూసేలా జనాలని ప్రేరేపించి… కలెక్షన్లు పెంచుకోవచ్చు.రిలీజ్ అయినప్పుడు పాజిటివ్ టాక్ వచ్చినా… నెగిటివ్ టాక్ కలెక్షన్లు నమోదయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.కొన్ని సినిమా యూనిట్లు అయితే మార్నింగ్ షో తర్వాత నుండే క్రాకర్స్‌ కాలుస్తూ… కేక్ లు కట్ చేస్తూ తమ సినిమా పై జనాల ఫోకస్ పడేలా చేస్తుంటారు.

ఇందుకు సినిమా చూసిన వాళ్ళ అభిప్రాయంతో సంబంధం ఉండదు. సరిగ్గా… ‘ఖిలాడి’ టీం కూడా ఇప్పుడు ఇదే ప్లాన్ చేస్తుంది. ఫిబ్రవరి 11న విడుదలైన ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది. కానీ మొదటి వీకెండ్ కు డీసెంట్ వసూళ్ళను రాబట్టింది. దీంతో సక్సెస్ మీట్లు ప్లాన్ చేసిందట ‘ఖిలాడి’ టీం. కానీ వీటికి హీరో రవితేజ అంగీకరించడం లేదట. ‘ఖిలాడి’ కి సంబంధించి ఎటువంటి సక్సెస్ మీట్లు ప్లాన్ చేసినా… తనని దూరంగా ఉంచమని రవితేజ కోరాడట.

ఇక ‘ఖిలాడి’ కి సంబంధించి తన పని మొత్తం పూర్తయిపోయిందని కూడా రవితేజ తెలిపాడట. దాంతో హీరో లేకుండా ఈ సక్సెస్ మీట్లు ఎందుకని చిత్ర బృందం కూడా లైట్ తీసుకున్నట్టు తెలుస్తుంది.ఈ చిత్రం షూటింగ్ సమయంలో దర్శకుడితో రవితేజకి చెడిందని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ స్పీచ్ ఉంది. అతి కష్టం మీద రవితేజని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తీసుకువచ్చారనే టాక్ కూడా ఉంది.

ఖిలాడి సినిమా కోసం ఏకంగా రూ.65 కోట్ల బడ్జెట్ పెట్టేసారట. అయితే థియేట్రికల్ రైట్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ కింద రూ.49 కోట్లు మాత్రమే రికవర్ అయినట్టు తెలుస్తుంది. అయితే హిందీలో మాత్రం ‘ఖిలాడి’ బాగానే కలెక్ట్ చేస్తుంది. అక్కడ నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus