కెరీర్ ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’, విక్టరి వెంకటేష్ హీరోగా నటించిన ‘సంక్రాంతి’ ‘లక్ష్మీ’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన శర్వానంద్.. అటు తర్వాత ‘అమ్మ చెప్పింది’ ‘వీధి’ ‘గమ్యం’ ‘ప్రస్థానం’ వంటి చిత్రాలతో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.అక్కడి నుండీ ఇతను వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదు. శర్వానంద్ 17 ఏళ్ళ కెరీర్లో ఏనాడు వివాదాల జోలికి పోలేదు.ఎవరినీ ఓ మాట అన్న సందర్భం కూడా లేదు.అలాంటి శర్వా ఇటీవల పారితోషికం చెల్లించలేదని నిర్మాతలకు నోటీసులు పంపాడంటూ వస్తున్న వార్తలు పెద్ద చర్చకు దారి తీశాయి.
‘శ్రీకారం’ చిత్రానికి గాను.. అగ్రిమెంట్ ప్రకారం రూ.6 కోట్లు పారితోషికం చెల్లించాల్సిన నిర్మాతలు రూ.4.50 కోట్లు చెల్లించి.. బ్యాలెన్స్ రూ.1.5 కోట్లు చెల్లించనందున శర్వా కోర్టు కెక్కినట్టు ఒక వెర్షన్ వినిపిస్తుంది..! కానీ ‘శర్వానంద్ వల్ల ‘శ్రీకారం’ సినిమా షూటింగ్ 3 నెలల పాటు ఆగిపోయిందని.. అది అనుకున్న టైంకి పూర్తి చేసి విడుదల చేసి ఉంటే ఎక్కువ బడ్జెట్ అయ్యేది కాదు అలాగే ఫలితం కూడా మరోలా ఉండేది అని.. అయినప్పటికీ మేము బ్యాలెన్స్ అమౌంట్ చెల్లించము అని ఎప్పుడూ చెప్పలేదని.. కరోనా పరిస్థితి కారణంగా మాకు ఏర్పడ్డ ఆర్థిక సమస్యల వల్ల శర్వాకు బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వడం డిలే అయ్యిందని’ నిర్మాతల వెర్షన్ వినిపిస్తుంది.
ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే.. శర్వానంద్ ఇప్పుడు ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ అనే చిత్రంలో ఎటువంటి పారితోషికం తీసుకోకుండానే నటిస్తున్నాడు. అతను డబ్బు కోసం ఆలోచించే వ్యక్తో లేక డబ్బు కోసం దర్శక నిర్మాతల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తో అయితే అస్సలు కాదు. ఇక ’14 రీల్స్’ నిర్మాతలు కూడా ఇప్పటివరకు ఏ హీరోని కూడా డబ్బుల కోసం ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. సో ఇక్కడ మనీ అనేది మెయిన్ ఇష్యు కాదు.ఏదో విషయంలో వీరిరువురి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.. అనేది ప్రస్తుతం నడుస్తున్న చర్చ.అది నిజమే అయితే అరవింద్, దిల్ రాజు వంటి పెద్దల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి.. రాజీ కుదుర్చుకుంటే బెటర్ అని కొందరి అభిప్రాయం.మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి..!
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!