Shruti Hassan: ఆ సీనియర్ హీరోకు శృతిహాసన్ గ్రీన్ సిగ్నల్!

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం బరువు పెరుగుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ మూవీ కోసం గోపీచంద్ మలినేని కొన్ని నెలల క్రితం శృతి హాసన్ ను సంప్రదించిన సంగతి తెలిసిందే. అయితే శృతి హాసన్ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటించలేనని గెస్ట్ రోల్ లో నటించడానికి మాత్రం తనకు అభ్యంతరం లేదని చెప్పినట్టు గతంలో వార్తలు వచ్చాయి. బాలకృష్ణకు జోడీగా త్రిష లేదా మరో హీరోయిన్ నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది.

అయితే చివరకు శృతి హాసన్ నే ఈ సినిమాలో ఫిక్స్ చేశారని గృహిణి పాత్రలో శృతి కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే శృతితో గోపీచంద్ మలినేని బలుపు, క్రాక్ సినిమాలను తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. గోపీచంద్ మలినేనిపై ఉన్న అభిమానం వల్ల శృతి ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారని తెలుస్తోంది. ఇప్పటివరకు బాలకృష్ణ, శృతిహాసన్ కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు.

బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు రౌడీయిజం అనే టైటిల్ ఫిక్స్ అయిందని వార్తలు రాగా మేకర్స్ ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టతనిచ్చారు. త్వరలో ఈ సినిమా టైటిల్ గురించి క్లారిటీ రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. బాలయ్య వరుసగా విజయాలు దక్కేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus