Shruti Hassan: అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కు శృతి హాసన్ అందుకే రాలేదా?

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శృతి హాసన్ హాజరు కాకపోవడం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. వీరసింహారెడ్డి ఈవెంట్ కు హాజరైన శృతి హాసన్ వాల్తేరు వీరయ్య ఈవెంట్ కు హాజరు కాకపోవడం అభిమానులను హర్ట్ చేసింది. అయితే శృతి హాసన్ చిరంజీవికే కాదు బాలయ్యకు కూడా హ్యాండ్ ఇచ్చారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అన్ స్టాపబుల్ షోకు వీరసింహారెడ్డి టీమ్ హాజరు కాగా శృతి హాసన్ మాత్రం హాజరు కాలేదు.

శృతి హాసన్ ను నిజంగానే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని అందుకే ఆమె ఈ షోకు హాజరు కాలేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం రెండు సినిమాల ప్రమోషన్స్ కు సమయం కేటాయించలేక శృతి హాసన్ మూవీ ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. శృతి హాసన్ ప్రమోషన్స్ కు హాజరై ఉంటే బాగుండేదని కొంతమంది చెబుతున్నారు. మరోవైపు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తాయో అనే చర్చ జరుగుతోంది.

నందమూరి, మెగా అభిమానులు ఈ రెండు సినిమాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తాయో చూడాల్సి ఉంది. ఈ రెండు సినిమాల ట్రైలర్లు అంచనాలను మించి మెప్పించాయి. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి, రవితేజ కాంబో సీన్లు అదుర్స్ అనేలా ఉంటాయని తెలుస్తోంది.

పూనకాలు లోడింగ్ సాంగ్ లో చిరంజీవి, రవితేజ స్టెప్స్ హైలెట్ గా నిలుస్తాయని సమాచారం అందుతోంది. వాల్తేరు వీరయ్యలో రవితేజ పాత్ర చనిపోతుందని సమాచారం. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంతో పాటు అంచనాలను మించి రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus