Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ ను చిరు ఎందుకు మార్చారు.. పెద్ద కహానీ ఇది..!

  • December 29, 2022 / 05:29 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ పేరుతో ఈ మూవీ తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో రవితేజ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ అయిన గ్లిమ్ప్స్, లిరికల్ సాంగ్స్, రవితేజ టీజర్ వంటి వాటికి పాస్ మార్కులు పడ్డాయి. దీంతో కచ్చితంగా ఈ సినిమా సంక్రాంతికి సూపర్ హిట్ అవుతుంది అని అంతా అనుకుంటున్నారు.

సినిమా కథ రొటీన్ గానే ఉంటుంది అని మెగాస్టార్ చిరంజీవే.. చెప్పేసారు. కాబట్టి సినిమా కథను కొత్తగా ఊహించలేం కానీ కథనం ఆసక్తికరంగా సాగుతుంది అని స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి ముందు ‘వాల్తేరు శీను’ అని టైటిల్ అనుకున్నారట. దర్శకుడు బాబీ ఆ టైటిల్ ను పెట్టడం జరిగిందట. అయితే చిరు ఆ టైటిల్ ను కాదని ‘వాల్తేరు వీరయ్య’ గా మార్చినట్లు తెలుస్తోంది. అందుకు ఓ కథ కూడా ఉందట..!

‘చిరంజీవి జీవితంలో ‘వీరయ్య’ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడట. ఆయనకు నివాళిగా చిరు ఈ సినిమాలో తన పాత్రకు ఆ పేరును పెట్టినట్లు తెలుస్తుంది. చిరంజీవి సినిమాల్లోకి రాకముందు ఆయన పేరు శివశంకర వరప్రసాద్. చదువుకునే రోజుల్లోనే నటనపై ఆయనకు ఆసక్తి ఎక్కువ. “చిరంజీవి ఫేస్ కటింగ్, డ్యాన్సులు అన్నీ చూసి వీరయ్య అనే వ్యక్తి చిరంజీవి తండ్రితో ‘మీ వాడు సినిమాల్లోకి వెళ్తే బాగా రాణిస్తాడయ్యా’ అని చెప్పాడట.

ఆ రోజు ఆయన అన్న ఆ ఒక్క మాట మనకు ఓ మెగాస్టార్ ను అందించింది. చిరంజీవి తిరుగులేని హీరోగా నిలబడడానికి సాయపడింది. అందుకే ఆ వీరయ్య పేరు ఈ సినిమాకి పెట్టారు. అందులో చాలా మాస్ ఉందని నిర్మాతలు కూడా ఓకే చేశారు. ఇక ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus