డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అంటుంటారు చాలామంది. అలా నిజంగా అయ్యారో లేదో తెలియదు కానీ ఆ మాటను మాత్రం బలంగా చెబుతూ ఉంటారు. అలా అని అందరూ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారా అంటే లేదనే చెప్పాలి. కొందరు పోలీసు కాబోయి కూడా యాక్టర్ అయి ఉంటారు. అయితే ఇంకొందరు పోలీసుగా చేసి ఉద్యోగ విమరణ చేసి సినిమాల్లోకి వస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తి ఇప్పుడు ఓ సినిమా చేశారు. ఆ సినిమా పేరే ‘ది ట్రయల్’.
ఆ దర్శకుడి పేరే రామ్ గన్ని. డిప్యూటీ జైలర్‌గా పదేళ్ల కెరీర్ ఆయన విధులు నిర్వర్తించారు. రామ్ గన్ని పూర్తి పేరు రామానాయుడు గన్ని. విశాఖపట్నాకికి చెందిన ఆయనకు కాలేజీ రోజుల నుండే సినిమాలపై ఆసక్తి ఉండేదట. జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్‌గా 2012 నుంచి 22 వరకూ ఉద్యోగం చేశారు. ఇప్పుడు పదవీవిరమణ తీసుకొని సినిమా చేశారు. సినిమాలపై తపనతో ఉద్యోగ విరమణ చేసి పరిశ్రమకి వచ్చా. కొత్త రకం ప్రజెంటేషన్‌తో సినిమాని తెరకెక్కించాం అని చెప్పారు నరేశ్.
మరోవైపు నేర సంఘటనలు, నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కథల్ని విన్న ఆయన… ఇప్పుడు ఓ కల్పిత కథ రాసుకొని, దానికి ఆ విషయాల్ని అన్వయించుకున్నారట. విదేశాల్లో జరిగిన కొన్ని సంఘటనల్ని కూడా ఈ కల్పిత కథలో వాడుకున్నాను అని రామ్ గన్ని చెప్పుకొచ్చారు. ఈ నెల 24న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తెలుగులో విచారణ నేపథ్యంలో రూపొందిన తొలి చిత్రం ఇదని రామ్ గన్ని చెప్పారు. ఇప్పటివరకూ తెలుగు సినిమాల్లో విచారణ నేపథ్యంలో కొన్ని సన్నివేశాల్నే చూపించారు.
కానీ ఈ సినిమా (The Trail) మొత్తం విచారణ చుట్టూనే తిరుగుతుంది. అందుకే తొలి ఇంటరాగేటివ్ సినిమా అని కూడా టీమ్ చెబుతోంది. ఈ క్రమంలో ఇంటరాగేషన్ గది నుండి సినిమా కథ మొదలై… మళ్లీ అక్కడే ముగుస్తుందట. మహిళా ఎస్.ఐ, ఆమె భర్త కలిసి పెళ్లి రోజు చేసుకుంటుండగా జరిగిన సంఘటన చుట్టూ రామ్ గన్ని సినిమా సిద్ధం చేసుకున్నారట. ఓ విచారణాధికారీ, ఓ ఎస్.ఐకీ మధ్య విచారణను ఈ సినిమాలో ఈ చూడొచ్చట.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!