తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన బై లింగ్యువల్ మూవీ ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. టీజర్, ట్రైలర్లు బాగున్నాయి. దీంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అందుకు తగినట్లే బిజినెస్ కూడా బాగా జరిగింది. రామ్ కెరీర్లోనే అత్యధిక థియేట్రికల్ బిజినెస్ ఈ మూవీకి జరిగింది అని చెప్పొచ్చు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ మూవీ జూలై 14న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ మంచి ఓపెనింగ్స్ ను నమోదు చేసింది ఈ మూవీ. ‘ది వారియర్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం | 1.82 cr |
సీడెడ్ | 1.01 cr |
ఉత్తరాంధ్ర | 1.00 cr |
ఈస్ట్ | 0.50 cr |
వెస్ట్ | 0.62 cr |
గుంటూరు | 1.20 cr |
కృష్ణా | 0.35 cr |
నెల్లూరు | 0.30 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 6.80 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.38 cr |
తమిళనాడు | 0.32 cr |
ఓవర్సీస్ | 0.30 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 7.80 cr |
‘ది వారియర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.38.99 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.40 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.మొదటి రోజు ఈ చిత్రం రూ.7.8 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.32.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
తొలి రోజు ఈ చిత్రం హైర్స్ సాయంతో బాగా కలెక్ట్ చేసింది. ఆంధ్రాలో 5 ఏరియాలకు గాను రూ.1.6 కోట్ల వరకు హైర్స్ పడ్డాయి. ఈ వీకెండ్ మొత్తం ఇదే విధంగా క్యాష్ చేసుకుంటే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!