The Warriorr: ‘ది వారియర్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • July 14, 2022 / 10:55 AM IST

తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన బై లింగ్యువల్ మూవీ ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. టీజర్, ట్రైలర్లు బాగున్నాయి. దీంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అందుకు తగినట్లే బిజినెస్ కూడా బాగా జరిగింది. రామ్ కెరీర్లోనే అత్యధిక థియేట్రికల్ బిజినెస్ ఈ మూవీకి జరిగింది అని చెప్పొచ్చు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ మూవీ జూలై 14న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ‘ది వారియర్’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 11.20 cr
సీడెడ్ 5.50 cr
ఉత్తరాంధ్ర 3.80 cr
ఈస్ట్ 2.50 cr
వెస్ట్ 2.00 cr
గుంటూరు 2.50 cr
కృష్ణా 2.20 cr
నెల్లూరు 1.20 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 30.09 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.50 cr
తమిళనాడు 3.50 cr
ఓవర్సీస్ 1.90 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 38.99 cr

‘ది వారియర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.38.99 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.40 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. పోటీగా పెద్ద సినిమాలు కానీ లేదా క్రేజ్ ఉన్న సినిమాలు లేవు. నిన్నటి వరకు ఎడతెగకుండా కురిసిన వర్షాలు ఇప్పుడు తగ్గిపోయాయి. మంచి యాక్షన్ మూవీ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.కాబట్టి రామ్ సినిమాకి ఇది కలిసొచ్చే అంశం అనే చెప్పాలి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus