లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన బై లింగ్యువల్ మూవీ ‘ది వారియర్’ ఫుల్ రన్ ముగిసింది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో మంచి ఓపెనింగ్స్ నమోదయినప్పటికీ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది.
వీకెండ్ వరకు ఓకే అనిపించిన ఈ చిత్రం వీక్ డేస్ తర్వాత ఏ దశలోనూ రాణించలేకపోవడంతో డిజాస్టర్ గా మిగిలింది.ఒకసారి ‘ది వారియర్’ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 6.00 cr |
సీడెడ్ | 3.27 cr |
ఉత్తరాంధ్ర | 2.53 cr |
ఈస్ట్ | 1.41 cr |
వెస్ట్ | 1.22 cr |
గుంటూరు | 2.05 cr |
కృష్ణా | 1.05 cr |
నెల్లూరు | 0.70 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 18.23 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.14 cr |
తమిళనాడు | 1.45 cr |
ఓవర్సీస్ | 0.75 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 21.57 cr |
‘ది వారియర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.38.99 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.40 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.21.57 కోట్ల షేర్ ను రాబట్టింది. బిజినెస్ పై చూసుకుంటే బయ్యర్స్ కు ఈ చిత్రం రూ.17.42 కోట్ల నష్టాలను మిగిల్చింది.
‘రెడ్’ తో పోలిస్తే ఎక్కువ బిజినెస్ జరగడంతో ‘ది వారియర్’ కు భారీ నష్టాలు వాటిల్లాయి అని స్పష్టమవుతుంది. దీంతో ఈ చిత్రాన్ని పెద్ద డిజాస్టర్ గా పరిగణించాలి.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?