కొంచెం తమిళ వాసన కొట్టినా.. ఓకె అనిపిస్తుంది..!

రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ‘వారియర్’. ‘శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్’ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శింబు పాడిన ‘బుల్లెట్…’ సాంగ్ హిట్ అయ్యింది.. దాంతో ఈ చిత్రం పై అందరి ఫోకస్ పడింది. రామ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. విలన్ గా ఆది నటిస్తున్నాడు. జూలై 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. రేపు రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు టీజర్ ను విడుదల చేశారు.

చూడ్డానికి ఈ టీజర్ బాగానే ఉన్నా.. కొంచెం తమిళ వాసన కొట్టింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. రామ్ ఎనర్జీకి తగ్గ పాత్ర దొరికినట్టు ఉంది. అతని లుక్ కూడా బాగుంది. హీరోయిన్ కృతి శెట్టి కూడా తన లుక్స్ తో ఆకట్టుకుంది. విలన్ గా ఆది లుక్ కానీ అతని మేనరిజమ్స్ కానీ సరైనోడు రోజుల్ని గుర్తుచేసే విధంగా ఉంది.

ఈ టీజర్లోని డైలాగులు :

1) ఈ పోలీసోళ్ళ టార్చర్ భరించలేకపోతున్నా అప్పా.. ఇంతకు ముందు సైలెంట్ గా ఉండేటోళ్ళు, ఇప్పుడు వైలెంట్ గా లోపలేస్తున్నారు.

2) ఈ మధ్య సత్య అని ఒకడొచ్చినాడు.. ఓడియమ్మ.. ఒక్కొక్కడికి పెడుతున్నాడు!

3) కానీ ఒకటప్పా కొట్టిన వెంటనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇస్తున్నాడు

4) అట్టా కొడతాడు టాబ్లెట్ ఇస్తాడు.. అట్టా కొడతాడు టాబ్లెట్ ఇస్తాడు

5) ఆట బానే ఉంది ఆడేద్దాం(విలన్)

6) పాన్ ఇండియా సినిమా చూసుంటారు.. పాన్ ఇండియా రౌడీస్ ను చూసారా

7) మై డియర్ గాంగ్స్టర్స్.. వీలైతే మారిపోండి లేకపోతే పారిపోండి.. ఇదే నేను మీకు ఇస్తున్న ఫైనల్ వార్ణింగ్

8) ధైర్యం అంటే వెతుక్కుంటూ వచ్చిన వాడిని కొట్టడం కాదు.. వెతుక్కుంటూ వెళ్ళి కొట్టడం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!


మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus