రామ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ది వారియర్ సినిమా ఈ నెల 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ టికెట్ రేట్లతో విడుదలైన సినిమాలలో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. అయితే ది వారియర్ కూడా ఎక్కువ టికెట్ రేట్లతోనే థియేటర్లలో విడుదలవుతూ ఉండటం గమనార్హం. నైజాంలో మల్టీప్లెక్స్ లలో ది వారియర్ టికెట్ ధర 295 రూపాయలు కాగా సింగిల్ స్క్రీన్ లలో 175 రూపాయలుగా ఉంది.
ఏపీలో మల్టీప్లెక్స్ లలో ఈ సినిమా టికెట్ ధర 177 రూపాయలు కాగా సింగిల్ స్క్రీన్ లలో 147 రూపాయలుగా ఉంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుండగా ఈ టికెట్ రేట్లతో రామ్ సక్సెస్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది. ఏఎంబీ సినిమాస్ లో ది వారియర్ సినిమా బుకింగ్స్ బాగానే ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం ఈ సినిమా బుకింగ్స్ ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ది వారియర్ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సిన బాధ్యత రామ్ పై ఉంది. లింగుస్వామి సైతం ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే మాత్రమే మరి కొందరు తెలుగు హీరోలతో పని చేసే అవకాశాన్ని అయితే దక్కించుకుంటారని చెప్పవచ్చు. వారియర్ టికెట్ రేట్లను కొంతమేర తగ్గిస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
మరోవైపు లింగుస్వామి బన్నీ కోసం తయారు చేసిన స్క్రిప్ట్ లో రామ్ నటిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. బన్నీ ఈ సినిమాను రిజెక్ట్ చేయగా రామ్ ఓకే చెప్పారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. కృతిశెట్టి ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు కృతిశెట్టికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.