Rajamouli: రాజమౌళికి ఆ పని చేయడం చేత కాదా..?

దర్శకధీరుడిగా రాజమౌళికి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో, ఇతర ఇండస్ట్రీల్లో ఉన్న గుర్తింపు, క్రేజ్ అంతాఇంతా కాదు. పర్ఫెక్షన్ కు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే రాజమౌళి సినిమాసినిమాకు తన మార్కెట్ ను పెంచుకోవడంతో పాటు హీరోల మార్కెట్ ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ దర్శకుడిలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. స్వయంగా రాజమౌళి భార్య రమ ఒక సందర్భంలో ఈ విషయాలను వెల్లడించారు. వెండితెరపై వండర్స్ క్రియేట్ చేసే రాజమౌళి నిజ జీవితంలో మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు.

రాజమౌళి సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్ గా కూడా పని చేసే రమ జక్కన్న వర్క్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటారని అయితే ఒకసారి వేరేవాళ్ల ఇంటికి వెళ్లిన సమయంలో ఫోన్ అనుకుని రిమోట్ కంట్రోల్ జేబులో పెట్టుకొని తెచ్చేశారని తెలిపారు. మరో సందర్భంలో రాజమౌళి కారు తాళాలు తెచ్చేశాడని ఆమె అన్నారు. ఇంట్లో ఏ వస్తువైనా కనిపించకుండా పోతే రాజమౌళి జేబులో వెతుకుతామని రమ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

డబ్బుల విషయాన్ని కూడా రాజమౌళి పట్టించుకోడని రాజమౌళితో ఎవరైనా బయటకు వెళితే ఎదుటివాళ్లే బిల్లు కట్టాలని రమ పేర్కొన్నారు. రాజమౌళి చెక్కుపై సంతకం సరిగ్గా చేయకపోవడం వల్ల కొన్నిసార్లు చెక్కులు క్యాన్సిల్ అయ్యాయని ఆమె తెలిపారు. రాజమౌళిని విమర్శించడానికి క్రిటిక్స్ అవసరం లేదని మేమే ఆయన సినిమాలపై విమర్శలు చేస్తామని రమ తెలిపారు. కొంచెం తేడా కొట్టినా ఎక్కి తొక్కేస్తామని పిల్లలు చాలా ఏడిపిస్తారని రమ అన్నారు. ఈ విషయం తెలిసి కొందరు నెటిజన్లు రాజమౌళికి చెక్కుపై సంతకం పెట్టడం కూడా చేత కాదా..? అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus