Indra: ఆ రోజు ఫ్యాన్స్‌ అడగకపోతే ‘ఇంద్ర’లో ఆ డైలాగ్స్‌ ఉండేవి కావట..

చిరంజీవి (Chiranjeevi)  సినిమా అంటే డ్యాన్స్‌లు, ఫైట్లు, కామెడీ. ఈ మాట మేం అనేది కాదు. ఎన్నో ఏళ్లు ఆయన అభిమానులు, ప్రేక్షకులు అనే మాటే. అందుకే ఆయన సినిమా వస్తోంది, వచ్చింది అనగానే ఈ ఎలిమెంట్స్‌ ఎంతలా ఉన్నాయి అనే కొలత కొలిచేస్తుంటారు. ఇవన్నీ బాగా ఉంటే.. సినిమా బ్లాక్‌బస్టర్‌ అని అంటుంటారు కూడా. మనమే కాదు ప్రముఖ రచయిత ద్వయం పరుచూరి సోదరులు కూడా ఇలానే అనుకున్నారట. అయితే ఆడియో ఫంక్షన్‌ తర్వాత మొత్తం ప్లాన్‌ మారిపోయిందట.

Indra

చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఇంద్ర’(Indra)   సినిమా రీరిలీజ్‌ మెగాస్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న తీసుకొస్తున్నారు. ఈ సమయంలో నాటి ఓ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. సినిమాలో చిరంజీవి పలికిన డైలాగ్స్‌కి థియేటర్లు దద్దరిల్లాయి. అయితే ఆ డైలాగ్స్ విషయంలో చాలా పెద్ద తతంగమే జరిగిందట. తొలుత సినిమాలో అన్ని డైలాగ్సే లేవట. ‘ఇంద్ర’ సినిమా సమయంలో చిరంజీవి..

రైటర్స్‌తో మాట్లాడుతూ సినిమాలో హెవీ డైలాగ్‌లు వద్దని, అభిమానులు తన నుండి అలాంటివి ఆశించరు అని అన్నారట. దానికి తగ్గట్టే పరుచూరి సోదరులు కూడా అలానే రాశారట. అయితే ఆడియో ఫంక్షన్ రోజున చిరు స్టేజీ మీదకు రాగానే.. సినిమా నుండి డైలాగ్ చెప్పమని ఫ్యాన్స్‌ అడిగారు. మామూలుగా స్టెప్పులేయమని అడిగేవాళ్లు.. డైలాగ్ అడిగేసరికి ఆశ్చర్యపోయిందట టీమ్‌. దీంతో ఆడియో ఫంక్షన్‌ అయిపోయాక..

పెండింగ్‌ షూటింగ్‌ చేసే క్రమంలో ఉన్న పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌ను రాసి.. షూట్‌ చేయించారట. ఆ రోజు అభిమానులు డైలాగ్‌ అడగకపోయుంటే.. ఇప్పుడు మనం చూస్తున్న ‘ఇంద్ర’ సినిమా ఇలా ఉండేది కాదు. మామూలుగా అయితే చిరంజీవి నుండి అభిమానులు డైలాగ్స్‌ అడగరు.. అయితే సీమ నేపథ్యంలో సినిమా అవ్వడం.. ఇతర హీరోలు అలాంటి సినిమాలు చేసి భారీ డైలాగులతో ఊదరగొట్టడం వల్లనే చిరును ఆ డైలాగ్స్‌ అడిగారు అని చెప్పొచ్చు.

పూరి జగన్నాథ్‌ ఎదుట మళ్లీ అదే ప్రశ్న.. కుర్ర హీరోలు ఇక కష్టమేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus