#BiggBossTelugu6: ఈ పార్టిసిపెంట్స్ సింపతీతోనే వచ్చారు. వాళ్లు ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ – 6 రచ్చ మొదలైంది. హౌస్ లో మొత్తం 21 మంది పార్టిసిపెంట్స్ నాన్ స్టాప్ గా ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఫస్ట్ డే నుంచే హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ ని స్టార్ట్ చేసేశారు. దీంతో 21మంది వాళ్ల గేమ్ స్ట్రాటజీలని చూపిస్తున్నారు. ఫస్ట్ డే నాగార్జున ఇంట్రడక్షన్ లోనే చాలామందికి సింపతీ వర్కౌట్ అయ్యిందనే చెప్పాలి. కొంతమందికి వాళ్ల జీవితంలో జరిగిన సంఘటలు ప్లస్ అయితే, మరికొంతమంది వాళ్ల ఎవిలతోనే సింపతీని సంపాదించారు.

ఫస్ట్ పార్టిసిపెంట్ గా వచ్చిన కీర్తిభట్ తన జీవితంలో జరిగిన విషాద సంఘటనని షేర్ చేసుకుంది. ఈ అమ్మాయి ఒక అమ్మాయిని కూడా దత్తత తీసుకుని పెంచుకుంటున్నాను అని చెప్పడం ఇప్పుడు కీర్తికి ప్లస్ అయ్యిందనే చెప్పాలి. తన లైఫ్ లో జరిగిన యాక్సిడెంట్, పేరెంట్స్ ని కోల్పోవడం, కోమాలో ఉండటం, తిరిగి మళ్లీ కెరియర్ లో పుంజుకుని ఈ స్టేజ్ వరకూ రావడం గ్రేట్ అనే అంటున్నారు అందరూ.

తర్వాత పార్టిసిపెంట్స్ లో చలాకీ చంటి కూడా తన జీవితంలో ఎవరూ లేరని, అప్పుడు తన వైఫ్ వచ్చిందని, తన వల్లే ఈ రేంజ్ లో ఉన్నాని సింపతీని వర్కౌట్ చేశాడు.

ఇక ఇదే విధంగా ఇనయ సుల్తానా కూడా తన ఫాదర్ గురించి చెప్పింది. తన ఫాదర్ లేకపోవడం తనకి పెద్ద లోటని స్టేజ్ పైనే ఎమోషనల్ అయ్యింది. సింపతీ వర్కౌట్ చేసుకుంది.

యూట్యూబర్స్ ఎంతగానే ఎదురుచూసిన ఆదిరెడ్డి సైతం తన సిస్టర్ గురించి చెప్పి అందరి గుండెలని పిండేశాడు. ఇది కూడా తనకి సింపతీ వర్కౌట్ అయ్యిందనే చెప్పొచ్చు.

ఇక ఎవిలోనే ఏడిపించేసింది ఫైమా. తన నవ్వుల వెనుక ఎంతటి విషాదం ఉందని చాలా క్లియర్ గా చెప్పింది. అంతేకాదు, తన కుటుంబం ఎన్ని కష్టాలు పడింది ? తన గురించి ఎవరు ఎలా కామెంట్ చేశారో చెప్తూ ఎమోషనల్ అయ్యింది. సింపతీ బాగానే వర్కౌట్ చేసింది.

ఇక చిన్నప్పుడే అమ్మా నాన్నలకి దూరమై అమ్మమ్మ దగ్గర పెరిగిన ఇస్మార్ట్ పోరి అరోహి రావ్ కూడా సింపతీని బాగానే వర్కౌట్ చేసింది. చిన్నప్పుడు పడిన కష్టాలు అన్నీ కళ్లకి కట్టినట్లుగా చెప్పింది.

గీతురాయల్ కూడా తనకి జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్తూ సింపతీ గైన్ చేయడానికి ట్రై చేసింది. అయితే, తను గలగల మాట్లాడేయటం, వెంటనే తన కెరియర్ గురించి చెప్పడం అనేది కొద్దిగా ప్లస్ అయ్యింది.

సింగర్ రేవంత్ కూడా తను పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. ఇలా ఈసారి బిగ్ బాస్ లో కొంతమంది పార్టిసిపెంట్స్ సింపతీ కార్డ్ ని బాగానే యూజ్ చేశారు. ఫస్ట్ టైమ్ కాబట్టి పర్లేదు కానీ, అస్తమానం ఇదే కార్ట్ వాడాలని చూస్తే మాత్రం ఆడియన్స్ బిగ్ బాస్ ఇంటి నుంచీ తమ ఇంటికి పంపించేస్తారు. మరి ఈ నాన్ స్టాప్ లైవ్ లో ఎవరు ఎలా ఆడతారు ? ఎవరు గేమ్ ప్లాన్ ని వర్కౌట్ చేస్తారు అనేది ఆసక్తికరం.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus