ప్రముఖ నటి వినయ ప్రసాద్ ఇంట్లో చోరీ జరిగినట్లు కన్నడ మీడియా కథనాలు ప్రసారం చేసింది.. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. దీంతో ఫిలిం, మీడియా వర్గాల్లో వినయ ప్రసాద్ ఇంట్లో చోరి జరిగిన విషయం హాట్ టాపిక్‌గా మారింది.. ఈ పాపులర్ ఆర్టిస్టు గురించి తెలుగు ఆడియన్స్‌కి కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు.. పలు సినిమాల్లో ఎన్నో మంచి క్యారెక్టర్లు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో సీరియల్స్, సినిమాల్లో నటించారు వినయ ప్రసాద్..
ఇంద్ర, కలిసుందాం రా, చంద్రముఖి, దూకుడు ఇలా పలు సూపర్ హిట్ మూవీస్ చేశారు. అయితే ఇప్పుడామె ఇంట్లో చోరీ జరిగిందనే వార్త వైరల్‌గా మారింది.. వివరాళ్లోకి వెళ్తే.. ఎప్పుడూ షూటింగ్స్‌తో బిజీగా ఉండే వినయ ప్రసాద్.. దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉడిపి వెళ్లారు. ఆ సమయంలోనే బెంగుళూరులోని నందిని లేఅవుట్‌లో ఉన్న వినయ ప్రసాద్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంటి తాళాలు, లాకర్ పగులగొట్టి డబ్బు ఎత్తుకెళ్లారు..
ఉడిపి నుండి తిరిగివచ్చిన తర్వాత ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడం చూసి షాక్ అయ్యారు వినయ ప్రసాద్ ఫ్యామిలీ.. 26వ తేదీన తిరిగొచ్చేసరికి ఈ సంఘటన జరిగిందని.. లాకర్ విరగ్గొట్టి డబ్బు దొంగిలించారని వినయ ప్రసాద్ దంపతులు ఫిర్యాదు చేశారు. అయితే పోయిన సొమ్ము ఎంతనే వివరాలేవీ బయటకి రాలేదు.. వినయ ప్రసాద్ నుండి కంప్లైట్ తీసుకున్న బెంగుళూరు పోలీసులు విచారణ చేపట్టారు.
వీఐపీలు ఎక్కువగా ఉండే నందిని లేఅవుట్‌లో వినయ ప్రసాద్ లాంటి సెలబ్రిటీ ఇంట్లో చోరీ జరగడంతో అందరూ షాక్ అయ్యారు.. దోపిడీ దొంగలు, పాత నేరస్థులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారని సమాచారం. వినయ ప్రసాద్ ఇంట్లో చోరీ జరిగిందనే న్యూస్ కన్నడ, మలయాళ, కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..