Thegimpu Twitter Review:తెగింపు సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అజిత్ నటించే సినిమాలన్నీ దాదాపు తెలుగులో డబ్ అవుతూ ఉంటాయి. ఈ సంక్రాంతి ‘తెగింపు’ (తమిళంలో తునివు) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జనవరి 11న ఈ మూవీ తమిళ్, తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతుంది. బోనీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు.

జిబ్రాన్ సంగీత దర్శకుడు కాగా…నీరవ్ షా కెమెరామెన్‌గా పని చేశారు.రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్, ఐవీవై ప్రొడక్షన్ సంస్థలు కలిసి ‘తెగింపు’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముద్రఖని వంటి వారు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం షోలు ఆల్రెడీ కొన్ని చోట్ల పడ్డాయి. సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం ఈ సినిమా.. ఫస్ట్ హాఫ్ బాగుందట.

స్లోగా స్టార్ట్ అయినా ఇంటర్వెల్ కు ముందు సినిమా పుంజుకుంది అని తెలుస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను విసిగిస్తాయట. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ బాగుంది అని అంటున్నారు. కొంచెం మనీ హీస్ట్, బీస్ట్ వంటి రిఫరెన్స్ లు వాడినా వాటికి ‘తెగింపు’ కి సంబంధం లేదట. ఓవరాల్ గా ఇది సంక్రాంతి పండుగకు చూసే సినిమా కాదని ప్రేక్షకులు అంటున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus