Naga Chaitanya: ఆ 6 మంది నన్ను బాగా తిడుతుంటారు: నాగ చైతన్య

నాగ చైతన్య హీరోగా ‘థాంక్యూ’ మూవీ రూపొందింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. జూలై 22న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ప్రమోషన్లలో నాగ చైతన్య చురుగ్గా పాల్గొంటున్నాడు. ఎన్నడూ లేని విధంగా ‘థాంక్యూ’ సినిమాని అతను బాగా ప్రమోట్ చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్ బాగున్నా.. ఎందుకో ఈ చిత్రం పై అంతగా బజ్ క్రియేట్ అవ్వలేదు. టాక్ బాగుంటే కచ్చితంగా జనాలు థియేటర్ కి వెళ్ళి ఈ సినిమాని చూస్తారు అని అంతా భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ ‘బంగార్రాజు’ చిత్రాలకు సంబంధించి ఎక్కువ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. బహుశా అతనికి పర్సనల్ లైఫ్ కు సంబంధించి ప్రశ్నలు ఎదురవుతాయనేమో. అయితే థాంక్యూ మూవీ ప్రమోషన్లు బాగానే జరుగుతున్నాయి. కానీ ఎవ్వరూ కూడా అతని పర్సనల్ లైఫ్ కు సంబంధించి ప్రశ్నలు ఎదురవ్వడం లేదు. ఇదిలా ఉండగా.. ఓ ఇంటర్వ్యూలో చైతన్య.. తనకు ఎక్కువ మంది స్నేహితులు అవసరం లేదు అంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

నాగ చైతన్య మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుండి నాకు సిగ్గు ఎక్కువ. వెరీ షై. నేను బాగా కంఫర్ట్ అనుకున్న వాళ్ళతో ఉన్నప్పుడు బాగా ఓపెన్ అవుతాను.కానీ నేను హ్యాపీగానే ఉన్నాను. నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ వద్దు. ఓ ఇరవై, ముప్పై మంది ఫ్రెండ్స్ వద్దు. రోజుకి ఇద్దరు, ముగ్గురు మందిని కలవడం నాకు ఇష్టం.

నాకు ఇద్దరు, ముగ్గురు ఉంటే చాలు ప్యూర్ హానెస్ట్ ఫ్రెండ్స్. నేను తప్పు చేస్తున్నాను అంటే నా మొహం మీద చెప్పాలి. అలాంటి మనుషులంటే నాకు ఇష్టం. అలాంటి ఓ గ్రూప్ ఉన్నారు. ఐదుగురు, ఆరుగురు.. ఆ గ్రూప్ లో ఉన్నారు. ఐ యాం హ్యాపీ” అంటూ చెప్పుకొచ్చాడు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus