10 ఏళ్ళ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం గురించి ఆసక్తికర విషయాలు!

విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు లు హీరోలుగా..అంజలి, సమంత లు హీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్లో చాలా గ్యాప్ తర్వాత రూపొందిన మల్టీ స్టారర్ మూవీ ఇది. ఓ రకంగా ఇప్పుడు మల్టీ స్టారర్ చిత్రాలు ఎక్కువగా రూపొందుతున్నాయి అంటే దానికి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం వల్లే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ‘పెళ్ళి సందడి’ చిత్రాన్ని ఏ విధంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారో.. అదే విధంగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. 2013వ సంవత్సరం జనవరి 11న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల అయ్యింది. నేటితో ఈ చిత్రం విడుదలై 10 ఏళ్ళు పూర్తికావస్తోంది .

అయితే ఇలాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని కొంతమంది మిస్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి:

1) రజినీ కాంత్ :

ప్రకాష్ రాజ్ పోషించిన రేలంగి మావయ్య పాత్రకు మొదట రజనీ కాంత్ ను అనుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. కానీ రజనీ ఈ రోల్ కు నొ చెప్పారు

2) నాజర్ :

రేలంగి మావయ్య పాత్రకు నాజర్ ను కూడా అనుకున్నారు. కానీ చివరికి ప్రకాష్ రాజ్ నే ఫైనల్ చేశారు.

3) పవన్ కళ్యాణ్ :

మహేష్ పోషించిన చిన్నోడు పాత్రకు మొదట పవన్ కళ్యాణ్ ను అనుకున్నాడు శ్రీకాంత్. మొదట పవన్ ఓకె చెప్పాడు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల తప్పుకున్నాడు.

4) నాగార్జున :

వెంకటేష్ పోషించిన పెద్దోడు పాత్రకు మొదట నాగార్జున ను అనుకున్నారు. కానీ ఆయన చేయలేదు.

5) విద్యా బాలన్:

అంజలి పోషించిన సీత పాత్ర కోసం ఈమెను సంప్రదించారు. కానీ ఆమె నొ చెప్పింది.

6) భూమిక :

వెంకటేష్ పాత్రకు జోడీగా భూమిక ను అనుకున్నారు. కానీ ఒక్కడు లో మహేష్ కు జోడీగా చేసి తర్వాత వదినగా చేయడం ఇష్టం లేక ఆమె నొ చెప్పింది.

7) అనుష్క :

సీత పాత్రకే ఈమెను సంప్రదించారు.కానీ భూమిక చెప్పిన రీజనే ఈమె కూడా చెప్పి తప్పుకుంది.

8) సుధ :

జయసుధ పాత్రకు మొదట ఈమెను అనుకున్నారు. కానీ లుక్ టెస్ట్ లో ఈమె ఆ పాత్రకు సెట్ అవ్వలేదు అని భావించి ఈమెను తప్పించారు.

9) మణిశర్మ :

మ్యూజిక్ డైరెక్టర్ గా మొదట ఇతన్ని అనుకున్నారు. కానీ మిక్కీ జె మేయర్ ను ఫైనల్ చేశారు.

10) హినా ఖాన్ :

బాలీవుడ్ నటి హీనా ఖాన్ ను సమంత సిస్టర్స్ లో ఒకరుగా అనుకున్నారు. కానీ ఈమె అనూహ్యంగా బరువు పెరగడంతో తప్పించారట.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus