పొగ తాగడం, మానేయడం చేసిన 15 మంది సెలబ్రిటీస్ వీళ్లే..!

‘పొగ (Smoking) తాగనివాడు దున్నపోతై పుట్టున్’ అన్నాడో కవి.. ‘సరదా సరదా సిగరెట్టు.. ఇది దొరల్ దాగ్ భల్ సిగరెట్టు.. పట్టు పట్టి ఒక దమ్ములాగితే స్వర్గానికి ఇదే తొలిమెట్టు’ అని రాశారో సినీ కవి.. తెరమీద పాత్ర పరిధి మేరకు చుట్ట, బీడీ, సిగరెట్, సిగార్, హుక్కా లాంటివి కాల్చడం.. ఆ అలవాటుకి ప్రొఫెషన్, ప్యాషన్ లాంటివి కారణాలుగా చూపిస్తుంటారు.. సిగరెట్ ప్యాకెట్ మీద ‘పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం’ అని హెచ్చరించినా.. బస్సుల్లో, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్దం అని రాసినా.. సినిమా ప్రారంభంలో ప్రకటనలతో చెప్పినా చాలా మందికి మానడం కాస్త కష్టంగానే ఉంటుంది.. అలాగే ఈ అలవాటు నిజ జీవితంలోనూ పలువురు సినీ ప్రముఖులుకు, నటీనటులకు కూడా ఉంది.. క్రియేట్ ఫీల్డ్ కాబట్టి రైటర్స్ బ్లాంక్ అని.. ఆలోచనో, ఆనందం కోసమో తాగేవారూ ఉన్నారు.. దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు చాలామందికి ధూమపానం అలవాటే.. స్టార్స్ పెద్దగా ఎఫెక్ట్ లేని కాస్ట్లీ విదేశీ బ్రాండ్స్ మెయింటెన్ చేస్తుంటారు.. వాటిమీద ‘స్మోకర్ డై యంగర్’ అని రాసుంటుంది.. కొంతమంది పట్టు పట్టి మానేస్తే.. మరికొందరు కొన్ని కారణాల వల్ల ఆపేశారు.. ఆ స్టార్స్ ఎవరో కొన్ని వివరాలు చూద్దాం..

1) ఎన్టీరామారావు..

ఎన్టీఆర్ గారికి చుట్ట తాగే అలవాటు ఉంది.. ఉదయాన్నే లేవగానే ఓ మగ్గుడు నీళ్లు తాగి.. తాపీగా చుట్ట తాగేవారట.. దాని ద్వారా గొంతు స్వరం గంభీరంగా వస్తుందని అలా చేసేవారట..

2) ఏఎన్నార్..

ఏఎన్నార్ గారికి కొద్ది కాలం మాత్రమే అలవాటు ఉండేది.. ఎన్టీఆర్‌తో మాత్రమే కలిసి తాగేవారని ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో చూపించారు.. అలాగే రామారావు గారికి నాగేశ్వర రావు గారు సిగరెట్ వెలిగిస్తున్న ఓ అరుదైన ఫోటో కూడా నెట్‌లో కనిపిస్తుంది..

3) ఎస్వీ రంగారావు..

మహానటుడు ఎస్వీ రంగారావు గారు కూడా పొగ  ప్రియులే.. ఆరోజుల్లోనే ఆయన ఓ పాపులర్ సిగరెట్ (బర్క్‌లీ) బ్రాండ్‌కి ప్రచారకర్తగా వ్యవహరించడం విశేషం..

4) రజినీ కాంత్..

సూపర్ స్టార్ రజినీ కాంత్ చైన్ స్మోకర్.. సిగరెట్స్, సిగార్స్, చుట్ట కాల్చేవారని చెప్తుంటారు.. ఆయన ఆఫ్ స్క్రీన్ సిగరెట్ నోట్లో వేసే స్టైలే సూపర్ స్టార్‌ని చేసింది.. ఆన్ స్క్రీన్ కూడా అదరగొట్టేసిన రజినీ కొద్ది కాలం క్రితం దీని కారణంగా ఆసుపత్రి పాలయ్యారు.. అప్పటినుండి పొగ తాగడం ఆపేశారాయన..

5) కమల్ హాసన్..

కమల్ హాసన్ తన 11వ ఏటనే పొగ తాగడం మొదలు పెట్టారట.. అలవాటు కాస్తా వ్యసనంగా మారుతుందేమోననే భయంతో చాలా త్వరగానే మానేశారట..

6) బాలకృష్ణ..

బాలయ్య గొంతు బాగా బేస్ రావడానికి రోజూ ఉదయాన్నే ఒక చుట్ట తాగుతానని వేదిక మీద, పలు ఇంటర్వూల్లోనూ చెప్పారు.. అలాగే చెన్నైలో సినీ తారల మ్యాచ్ అప్పుడు గ్యాలరీలోనే దమ్ముకొట్టారు కూడా.. ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు గిరిబాబు, తనకు సన్నిహితులైన కొందరికి అక్కడి నుండి సిగార్లు, సిగరెట్లవీ తెచ్చిస్తుంటారట..

7) ప్రభాస్..

రెబల్ స్టార్ ప్రభాస్ కూడా చైన్ స్మోకరే.. గతంలో ‘సాహో’ హిందీ ప్రమోషన్స్ కోసం వెళ్లినప్పుడు తన అసిస్టెంట్‌కి సిగరెట్ ఇమ్మని సైగ చేసిన వీడియో.. ‘బాహుబలి’ షూటింగ్ అప్పుడు రానా – రవితేజలతో మాట్లాడుతుండగా చేతిలో సిగరెట్ పట్టుకున్న పిక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే..

8) మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కొద్ది కాలం క్రితం వరకు బాగా స్మోక్ చేసేవారట.. షూటింగ్ బ్రేక్ టైంలో డ్రైవర్‌ని కార్ తియ్యమని లొకేషన్ చుట్టుపక్కల రౌండ్స్ వేస్తూ.. ఎవరికీ తెలియకుండా స్మోక్ చేసి వచ్చేవారట.. తర్వాత స్టాప్ చేశారు.. దానికోసం ఆయన ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్ అనే బుక్ చదివారని సమాచారం.. అభిమానులను మిస్ లీడ్ చేయడం ఇష్టంలేకే మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు..

9) జూనియర్ ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్ కూడా కొన్నాళ్లు సరదాగా సిగరెట్ అలవాటుని కంటిన్యూ చేశారు.. అయితే పెళ్లికి ముందుగానే ఆయన పొగ తాగడం మానేశారట..

10) రానా దగ్గుబాటి..

టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటికి కూడా స్మోక్ హ్యాబిట్ ఉంది.. నీ వాయిస్ మరింత బాగుండాలంటే స్మోక్ స్టాప్ చెయ్ అని డాక్టర్ చెప్పడంతో అప్పటినుండి మానేశారు..

11) జగపతి బాబు..

జగపతి బాబు కూడా చైన్ స్మోకరే.. దానితో పాటు కాసినో లాంటి అలవాట్లున్నాయని.. కొంత కాలం క్రితం స్మోక్ మానేశానని ఆయనే చెప్పారు..

12) శ్రీకాంత్..

శ్రీకాంత్ కూడా పొగ ప్రియుడే.. ఆయనకు చాలా సంవత్సరాలుగా ఈ అలవాటు ఉంది..

13) సునీల్..

కమెడియన్ కమ్ హీరో సునీల్ సిగరెట్స్ ఎక్కువగా తాగుతారు.. ఆయన ఫ్రెండ్ త్రివిక్రమ్ చైన్ స్మోకర్ అయ్యిండి కూడా మానెయ్యగలిగితే సునీల్ మాత్రం మానుకోలేకపోయారు..

14) ప్రకాష్ రాజ్..

వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ కూడా ఎక్కువగా స్మోక్ చేస్తారు.. ఆ విషయం ఆయన లిప్స్ చూసి చెప్పెయ్యొచ్చు..

15) అజిత్ కుమార్..

తమిళ స్టార్ అజిత్ కుమార్ చాలా కాలం ఈ అలవాటు కంటిన్యూ చేశారు.. షాలినితో పెళ్లి తర్వాత పూర్తిగా మానేశారు..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus