ముగ్గురు హీరోల్లో ఒక్కరు కూడా రాలేదు.. కారణమిదేనా?

దిల్ రాజు అంటే టాలీవుడ్ ఇండస్ట్రీ అగ్ర నిర్మాతల్లో ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలు అతనికి చాలా సన్నిహితంగా ఉంటారు. పెద్దగా కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా స్నేహంగా ఉండేందుకే ప్రయత్నం చేస్తారు. అయితే దిల్ రాజు ఇటీవల టాలీవుడ్ స్టార్స్ కు ప్రత్యేకంగా స్పెషల్ పార్టీ ఇచ్చాడు. 50వ పుట్టినరోజు అనే కాకుండా పెళ్లి తరువాత రిసెప్షన్ కూడా జరపలేదు కాబట్టి అందరికి ఓకేసరి పార్టీ ఇచ్చేశాడు.

పార్టీలో తన భార్య తేజస్వినీని కూడా అందరికి పరిచయం చేశాడు. అయితే ఈ పార్టీలో మెగా ఘట్టమనేని అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు పాల్గొన్నారు. కానీ నందమూరి ఫ్యామిలికి చెందిన ఒక్క హీరో కూడా కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. నందమూరి ఫ్యామిలిలో దిల్ రాజుతో సినిమాలు చేసింది ఎన్టీఆర్ ఒక్కడే అయినప్పటికీ బాలకృష్ణ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు కాబట్టి పార్టీకి ఇన్వైట్ చేస్తారని అనుకున్నారు. కానీ ఆయనను ఆహ్వానించలేదట.

దీంతో తారక్, కళ్యాణ్ రామ్ ను పిలిచినప్పటికి వెళ్లలేదనే ఊహాగానాలు వస్తున్నాయి. మెగాస్టార్, ప్రభాస్, పవన్, మహేష్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ ఇలా అందరు వచ్చినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరి నందమూరి హీరోల ఎందుకు రాలేదనే కామెంట్స్ కు దిల్ రాజు టీమ్ ఏమైనా క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45


Most Recommended Video

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus