Bigg Boss 7 Telugu: మొదటివారం నామినేషన్స్ లో రచ్చ రచ్చ ! లైవ్ లో ఏం జరిగిందంటే.?

  • September 6, 2023 / 10:45 AM IST

బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం నామినేషన్స్ దుమ్ములేచిపోయాయి. వచ్చింది 14మంది కంటెస్టెంట్సే అయినా కూడా 20మంది వచ్చిన గోల చేశారు. బిగ్ బాస్ యాక్టివిటీ రూమ్ ని నరకంలా సృష్టించి అక్కడికి ఒక్కో పార్టిసిపెంట్స్ ని పిలిచి ఇద్దరిని నామినేట్ చేయమని చెప్పాడు. అంతేకాదు వారి ఫోటోలని చించి నరకంలో ఉన్న చితిలో వేయాలి. అలాగే, ఎవరిని అయితే నామినేట్ చేస్తున్నారో వారిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి పార్టిసిపెంట్ చెప్పిన రీజన్ ని వారికి చూపించారు. దీంతో హౌస్ లో గొడవలు స్టార్ట్ అయ్యాయి.

మొదటిరోజు టెలికాస్ట్ లో శివాజీ, ప్రియాంక జైన్ ల నామినేషన్స్ పూర్తి అయ్యాయి. ఇక రెండో రోజు నుంచీ ఆట షురూ అయ్యింది. శోభాశెట్టి నామినేషన్స్ నుంచీ గేమ్ స్టార్ట్ అయ్యింది. ముందుగా ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో చూసినట్లయితే., శోభాశెట్టి – కిరణ్ రాథోడ్ ఇంకా గౌతమ్ లని నామినేట్ చేసింది. థామిని – శోభాశెట్టి , రతికలని నామినేట్ చేసింది. ప్రిన్స్ యవార్ – షకీల ఇంకా గౌతమ్ లని నామినేట్ చేశాడు. సందీప్ – రతిక , ప్రిన్స్ లని నామినేట్ చేశాడు.

షకీల – ప్రిన్స్, పల్లవి ప్రశాంత్. గౌతమ్ – శోభాశెట్టి , ప్రిన్స్ యవార్ లని నామినేట్ చేశారు. ఆ తర్వాత శుభశ్రీ కూడా రతిక ఇంకా శోభాశెట్టిలని నామినేట్ చేసింది. పల్లవి ప్రశాంత్ – కిరణ్ , షకీల ఇద్దరినీ నామినేట్ చేశాడు. అమర్ దీప్ – ప్రిన్స్ యవార్ ని , టేస్టీతేజని నామినేట్ చేశాడు. కిరణ్ రాథోడ్ – ప్రశాంత్ ని ఇకా శోభాశెట్టిని నామినేట్ చేసింది. అలాగే టేస్టీ తేజ – పల్లవి ప్రశాంత్ ఇంకా కిరణ్ రాథోడ్ లని నామినేట్ చేశాడు.

రతిక – ప్రియాంక జైన్ ని ఇంకా థామినిని నామినేట్ చేసింది. ఇక్కడ చాలా క్లియర్ గా నలుగురు టార్గెట్ అయ్యారు. శోభాశెట్టి , ఇంకా రతిక, పల్లవి ప్రశాంత్ ఇంకా ప్రిన్స్ యవార్ లని టార్గెట్ చేశారు హౌస్ మేట్స్. అంతేకాదు, ఎవరికి వారే మాది జెన్యూన్ రీజన్ అనే అనుకున్నారు. నామినేషన్స్ తర్వాత చాలామంది ప్యాచ్ అప్ చేసుకోవాడనికి ట్రై చేశారు. కానీ, అవన్నీ బెడిసి కొట్టాయి. ముఖ్యంగా గౌతమ్ కృష్ణ అందరితో ప్యాచ్ అప్ చేసుకుందాం అనుకున్నాడు.

ముఖ్యంగా మోనితకి గౌతమ్ కి ఇద్దరికీ బాగా చెడింది. బెడిసి కొట్టింది. మోనిత నా ఇష్టం నా నామినేషన్స్ అంటూ గౌతమ్ పై విరుచుపడింది. అంతేకాదు, టేస్టీ తేజ పెట్టిన పుల్లని గౌతమ్ బయటపెట్టాడు. దీంతో ప్రిన్స్ యవార్ రియలైజ్ అయ్యాడు. ఇలా మొదటి వారం నామినేషన్స్ లో హౌస్ లో రచ్చ రచ్చ లేపాయి. ఇక లైవ్ లో చాలాసేపు అర్దరాత్రి వరకూ హైడ్రామా నడించింది. నామినేషన్స్ తర్వాత హౌస్ (Bigg Boss 7 Telugu) మేట్స్ గ్రూప్స్ గా తయారవుతున్నారు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus