సలార్ సినిమాలో ప్రభాస్ ను చూసిన అభిమానులలో చాలామంది ప్రభాస్ కు డైలాగ్స్ తక్కువగా ఉన్నాయని నిరాశకు గురి కావడం జరిగింది. సినిమాలోని డైలాగ్స్ అన్నీ కలిపితే కనీసం 3 నిమిషాల పాటు ప్రభాస్ కు డైలాగ్స్ లేవని కామెంట్లు వినిపించాయి. అయితే తర్వాత సినిమాల విషయంలో ప్రభాస్ నిరాశ పరచరని ఫ్యాన్స్ ఫీలయ్యారు. అయితే సలార్ లోటును రాజాసాబ్ తీరుస్తుందని ఈ సినిమాలో ప్రభాస్ గలగలా మాట్లాడతారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయి. రాజాసాబ్ మూవీలో ప్రభాస్ రోల్ కు ఎక్కువ సంఖ్యలో డైలాగ్స్ ఉంటాయని తెలుస్తోంది. ప్రభాస్ క్యారెక్టర్ ను అద్భుతంగా డిజైన్ చేశారని భోగట్టా. హర్రర్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కుతున్నా ప్రభాస్ ఫ్యాన్స్ ను మెప్పించే అన్ని అంశాలకు ఈ సినిమాలో ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ప్రభాస్ సినిమాలలో విజువల్ ఎఫెక్స్ట్స్ కు ప్రాధాన్యత ఉంది.
అదే విధంగా ఈ సినిమాలో కూడా విజువల్ ఎఫెక్స్ట్స్ కు ఎక్కువగానే ఇంపార్టెన్స్ ఇచ్చారని భోగట్టా. రాజాసాబ్ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా వేరే లెవెల్ లో ఉండనున్నాయని భోగట్టా. థమన్ మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ గా ఉంటుందని తెలుస్తోంది. రాజాసాబ్ మూవీ బడ్జెట్ విషయంలో మేకర్స్ ఏ మాత్రం రాజీ పడటం లేదని సమాచారం అందుతోంది. విశ్వంభర, రాజాసాబ్ పోటీ పడే ఛాన్స్ అయితే ఉండదని మరి కొందరు చెబుతున్నారు.
విశ్వంభర యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ కామెంట్లు చేస్తుండటం గమనార్హం. రాజాసాబ్ ప్రభాస్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందిస్తుందేమో చూడాల్సి ఉంది. రాజాసాబ్ కమర్షియల్ గా సక్సెస్ సాధించడం మారుతికి కూడా కీలకం అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ భవిష్యత్తు సినిమాలతో ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!