Shaakuntalam: శాకుంతలం మూవీ బ్రేక్ ఈవెన్ కావడం సులువు కాదా?

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన శాకుంతలం మూవీపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. గుణశేఖర్ ఈ సినిమా కోసం ఏకంగా 70 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. సినిమా రిలీజ్ ఆలస్యం కావడంతో ఈ సినిమాపై బడ్జెట్ భారం కూడా పడిందని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. శాకుంతలం బడ్జెట్ వల్ల సమంతకు ఇబ్బందేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. సమంత నటించిన యశోద మూవీ ఈ నెల 11వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అయినా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. సమంత సినిమాకు కనీసం 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తాయని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. అదే సమయంలో ఇతర భాషల్లో సమంత సినిమా ఆశించిన రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోలేదు. యశోద కలెక్షన్లు సమంత అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేశాయి. మరోవైపు త్వరలో శాకుంతలం సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

అల్లు అర్హ నటించడంతో కొంతమంది ఫ్యాన్స్ ఈ సినిమాపై ఆసక్తి చూపించినా ఈ సినిమాకు ఆశించిన రేంజ్ లో బిజినెస్ జరగడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. శాకుంతలం సినిమా 60 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించడం కూడా సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎవరైనా గెస్ట్ రోల్ లో నటించి ఉంటే ఈ సినిమాకు ప్లస్ అయ్యేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారక ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే ఉంది. సమంత తర్వాత ప్రాజెక్ట్ లు కూడా రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యశోద సినిమాతో సమంత పాన్ ఇండియా సక్సెస్ ను సొంతం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus