బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ప్రభాస్ ఒకరు కాగా సినిమా సినిమాకు ప్రభాస్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా ఇప్పటివరకు ఈ సినిమాకు 470 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోల సినిమాలకు హిట్ టాక్ వచ్చినా సాధించని స్థాయి కలెక్షన్లు ప్రభాస్ సినిమాలు నెగిటివ్ టాక్ తో సాధిస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరోల కంటే ప్రభాస్ ఇమేజ్ ఎక్కువ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కలెక్షన్లే ఇందుకు సాక్ష్యమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ హిట్ సినిమాలను మించి ప్రభాస్ సినిమాలు కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం. స్టార్ హీరో ప్రభాస్ గ్రేట్ అని బాహుబలి, బాహుబలి2 సినిమాల తర్వాత ప్రభాస్ మార్కెట్ అంచనాలకు మించి పెరిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ (Prabhas) నటించిన సలార్ టీజర్ మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుండగా ఈ టీజర్ కు ఊహించని స్థాయిలో వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో మరోసారి అంచనాలను అందుకోవడంతో పాటు అంచనాలను మించి మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ సినిమాలు సంథింగ్ స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అంద్తుతోంది.
భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ప్రభాస్ నిరాశపరిచే అవకాశం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఒక సినిమాలో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తుండటం గమనార్హం. ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికం తీసుకుంటున్నారు. ప్రభాస్ సినిమాలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు విడుదలయ్యే విధంగా ప్రభాస్ క్రేజ్ ను పెంచుకుంటున్నారు. ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో తన మార్కెట్ ను మరింత పెంచుకుంటారేమో చూడాలి.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!