పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజున ఇంకేమన్నా ఉంటాయా?

మెగా ఫ్యాన్స్‌ ఆగస్టు ఫెస్టివల్‌ను హ్యాపీగా పూర్తి చేసుకున్నారు. చిరంజీవి కొత్త సినిమాల అప్‌డేట్స్‌ వింటూ, చూస్తూ ఆగస్టును పూర్తి చేసేస్తున్నారు. ఇప్పుడు సెప్టెంబరు ఫెస్టివల్‌కు రంగం సిద్ధమైంది. అదే పవన్‌ కల్యాణ్‌ జన్మదినం. సెప్టెంబరు 2న పవన్‌ పుట్టిన రోజు అన్న విషయం తెలిసిందే. ఆ రోజు ఏయే అప్‌డేట్స్‌ వస్తాయి అంటూ అభిమానులు అప్పుడే లెక్కలేసుకోవడ మొదలెట్టారు. ఈ నేపథ్యంలో ఆ స్పెషల్‌ డేట్‌నాడు ఏ స్పెషల్స్‌ ఉండబోతున్నాయో చూద్దాం.

పవన్‌ కల్యాణ్‌ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. పవన్‌, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘భీమ్లా నాయక్‌’ (?) నుండి ఆ రోజు ఫస్ట్‌ సింగిల్‌ రాబోతోంది. ఆగస్టు 15 సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ఈ విషయం చిత్రబృందం చెప్పింది కూడా. అయితే ఆ పాట ఏంటి అనేది ఒకటి, రెండు రోజుల్లో తెలిసిపోతుంది. టైటిల్‌ మీద ఉన్న ఆ చిన్నపాటి డౌట్‌ను కూడా ఆరోజు తేల్చేస్తారేమో చూడాలి. అన్నట్లు విడుదల (జనవరి 12) తేదీ విషయంలో కొన్ని డౌట్స్‌ ఉన్నాయి. వాటిపైనా క్లారిటీ ఇస్తారేమో.

ఈ సినిమా కాకుండా ‘హరిహర వీరమల్లు’ సినిమా నుండి కూడా ఓ అప్‌డేట్‌ రావొచ్చు. అయితే ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల ఏమీ జరగలేదు. మరి ఏం రిలీజ్‌ చేస్తారో చూడాలి. గతంలో విడుదల చేసిన వీడియోకు మంచి స్పందనే వచ్చింది. అయితే మరో పోస్టర్‌, మోషన్‌ పోస్టర్‌ను ఆశించొచ్చు. పనిలోపనిగా కొత్త రిలీజ్‌ డేట్ చెబుతారామో చూడాలి. నిజానికి ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి తీసుకొస్తారని చెప్పారు. కానీ లెక్కలు మారాయి. దీంతో కొత్త డేట్‌ కావాలి.

ఇక మరో మైత్రీ మూవీ మేకర్స్‌ – హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రాబోయే సినిమా. ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా… కరోనా పరిస్థితుల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. పవన్‌ పుట్టిన రోజు నాడు దీనిపై ఏదైనా అప్‌డేట్‌ ఉంటుందేమో చూడాలి. ఇది కాకుండా రామ్‌ తాళ్లూరి – సురేందర్‌ రెడ్డి కాంబోలో సినిమా ఎప్పుడో ఓకే అయ్యింది. దానికి సంబంధించి అప్‌డేట్ రావాలి. ఇవన్నీ కాకుండా ఇంకొన్ని సినిమాల అప్‌డేట్స్‌ ఆశించొచ్చు. భగవాన్‌ – దానయ్య నిర్మాణంలో సినిమా చేస్తా అని పవన్‌ మాటిచ్చినట్లు గతంలో వార్తలొచ్చాయి. అదేమన్నా తేలుతుందేమో చూడాలి.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus