థర్డ్ వేవ్ ఎఫెక్ట్ : ఈసారి కరోనాకి దొరికిపోయిన 10 మంది స్టార్లు..!

ఇండియాలో కరోనా కేసులు మరోసారి ఊపందుతుంటున్నాయి. నిన్న ఒక్కరోజే 90 వేలకి పైగా కొత్త కేసులు నమోదవ్వగా.. 325 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటి సిట్యుయేషన్ చూస్తుంటే వైద్య నిపుణులు హెచ్చరించిన విధంగానే కరోనా థర్డ్ వేవ్ మొదలైనట్టు స్పష్టమవుతుంది. సామాన్యులే అనుకుంటే సినిమా సెలబ్రిటీలు కూడా కోవిడ్ బారినపడుతుండడం షాక్ ఇచ్చే అంశం. ఈ మధ్య కాలంలో కరోనా భారిన పడిన సినీ ప్రముఖులను ఓ లుక్కేస్తే :

1) మహేష్ బాబు :

కొద్దిసేపటి క్రితం తనకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్టు మహేష్ బాబు ట్వీట్ చేసాడు.

2) మంచు లక్ష్మీ :

ఈరోజే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ కూడా కరోనా భారిన పడ్డారు. తన సోషల్ మీడియా ద్వారా ఆమె ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.

3) అరుణ్ విజయ్‌ :

బ్రూస్ లీ, సాహో చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన అరుణ్ విజయ్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

4) కమల్ హాసన్ :

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూడా ఈ మధ్యనే కరోనా భారిన పడి కోలుకున్నాడు.

5) విక్రమ్ :

తమిళ- తెలుగు భాషల్లో మంచి స్టార్ డంని సంపాదించుకున్న హీరో విక్రమ్ కూడా కరోనా భారిన పడ్డాడు.

6)మీనా :

హీరోయిన్ మీనా కుటుంబంలో కూడా కరోనా కలకలం సృష్టించింది.

7) మంచు మనోజ్ :

మోహన్ బాబు చిన్న కొడుకు, ప్రముఖ హీరో అయిన మనోజ్ కూడా ఈ మధ్యనే కరోనా భారిన పడ్డాడు.

8) నోరా ఫతేహి :

ధృవ, మిస్టర్ మజ్ను వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నోరా ఫతేహి కూడా కరోనా భారిన పడింది.

9) విశ్వక్ సేన్ :

ఈ మధ్యనే మాస్ క దాస్ విశ్వక్ సేన్ కూడా కరోనా భారిన పడ్డాడు.

10) తమన్ :

సంగీత దర్శకుడు తమన్ కూడా కరోనా భారిన పడినట్టు ఇన్సైడ్ టాక్. కానీ అతనైతే అధికారికంగా ప్రకటించలేదు.

11) నవీన్ పోలిశెట్టి :

యంగ్ అండ్ క్రేజీ హీరో నవీన్ పోలిశెట్టి కూడా కరోనా భారిన పడినట్టు సమాచారం.

12) శివ కార్తికేయన్ :

‘రెమో’ ‘వరుణ్ డాక్టర్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో శివ కార్తికేయన్ కూడా ప్రస్తుతం ఐసొలేషన్ ఉన్నట్టు సమాచారం.

13) వరలక్ష్మీ శరత్ కుమార్ :

‘క్రాక్’ ‘నాంది’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన వరలక్ష్మీ కూడా కరోనా భారిన పడింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus