కంటెంట్ బలంగా ఉంటే తప్ప.. ఇప్పుడు వచ్చే సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడట్లేదు. ‘హీరోల మేనరిజమ్స్ కోసం మాత్రమే సినిమా హిట్ అవుతుంది’ అనేది ఒకప్పటి సక్సెస్ ఫార్ములా. కానీ ఇప్పుడు హీరో కంటే కూడా బలమైన ఎలిమెంట్స్, క్యారెక్టర్స్ ఉండి తీరాలి. అలాంటి సినిమాలకే మా టిక్కెట్టు అంటున్నారు ప్రేక్షకులు. అవును హీరో కంటే కూడా అలరించే ఎలిమెంట్స్ సినిమాలో ఉండాలి. హీరోని డామినేట్ చేసే రోల్స్… కాదు కాదు ఇలా అనకూడదు. హీరో కంటే కూడా హైలెట్ అయ్యే క్యారెక్టర్లు సినిమాలో ఉన్నా పర్వాలేదు..అని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇప్పుడు అలాంటి పాత్రల గురించే చెప్పుకోబోతున్నాం. రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే.. కొన్ని హిట్ సినిమాల్లో హీరోల పాత్రలకంటే హైలెట్ అయిన పాత్రలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి :
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో… హీరో కంటే కూడా అతని సవతి తండ్రిగా చేసిన మురళీ శర్మ (Murali Sharma) జీవించేశాడు అని చెప్పాలి. అతని పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచింది. సినిమా కూడా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
అడివి శేష్ (Adivi Sesh) హీరోగా శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నాని (Nani) నిర్మాత. ఈ సినిమాలో హీరో అడివి శేష్ కంటే కూడా సర్ప్రైజింగ్ విలన్ గా కనిపించిన సుహాస్ (Suhas) ఎక్కువ హైలెట్ అయ్యాడు. సినిమా సక్సెస్ లో అతని పాత్ర కూడా ఉందని చెప్పవచ్చు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా బాబీ (K. S. Ravindra) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ (Ravi Teja )కీలక పాత్ర చేశాడు. సెకండాఫ్ లో వచ్చే ఈ పాత్ర.. హీరో పాత్ర కంటే హైలెట్ గా నిలిచింది అని చెప్పవచ్చు.
కృష్ణవంశీ (Krishna Vamsi) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ (Prakash Raj) మెయిన్ రోల్. కానీ సినిమా మొత్తానికి బ్రహ్మానందం (Brahmanandam) పాత్ర హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. సినిమా పూర్తయినప్పటికీ కూడా బ్రహ్మానందం రోల్ మైండ్లో మెదులుతూనే ఉంటుంది.
తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో చైతన్య రావ్ (Chaitanya Rao Madadi), రాగ్ మయూర్ (Rag Mayur)..లు హీరోలు అనుకోవాలి. కానీ వాళ్ళ కంటే కూడా తరుణ్ భాస్కర్ రోల్ హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి.
6) కమిటీ కుర్రాళ్ళు (Committee Kurrollu) :
నిహారిక (Niharika) నిర్మాణంలో యదు వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరోలు ఉన్నప్పటికీ కూడా.. ప్రసాద్ బెహరా రోల్ హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి.
ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ (Narne Nithin) ..హీరోగా అంజి మణిపుత్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో… వినోద్ కుమార్ రోల్ హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. క్లైమాక్స్ లో ఈ పాత్రకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. సినిమా రిజల్ట్ నే మార్చేసింది అనడంలో సందేహం లేదు.
8) కల్కి 2898 ad :
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ రోల్ బాగా హైలెట్ అయ్యింది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ తన బెస్ట్ ఇచ్చారు. ఓ సూపర్ హీరో మాదిరి ఆయన కనిపిస్తారు.
9) సరిపోదా శనివారం :
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో… విలన్ గా చేసిన ఎస్.జె.సూర్య ఎక్కువ మార్కులు కొట్టేశాడు. సీరియస్ గా కనిపించినప్పటికీ నవ్విస్తూ ఎంటర్టైన్ చేశాడు సూర్య. సినిమాకి ఇతని పాత్ర హైలెట్ గా నిలిచింది.
10) మత్తు వదలరా 2 :
సింహా కోడూరి హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమెడియన్ సత్య రోల్ బాగా హైలెట్ అయ్యింది అని చెప్పాలి. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సత్య నటనే ఎంటర్టైన్ చేస్తుంది.