సర్ ప్రైజ్ లు సంచలనం సృష్టిస్తున్నాయిగా…!

ఈ ఏడాది సంక్రాంతి కి ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలతో పెద్ద బ్లాక్ బస్టర్లు దక్కాయి టాలీవుడ్ కి…! ఈ రెండు చిత్రాలు ఏకంగా 480 కోట్ల వరకూ గ్రాస్ కలెక్షన్ లను రాబట్టాయి. ఇదే ఓ అద్బుతం అనుకుంటే… అసలు సినిమాలే చెయ్యను అంటూ పది సార్లు పైనే చెప్పుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. తన 26 వ సినిమాని మొదలుపెట్టాడు. అది కూడా దిల్ రాజు సినిమా… అందులోనూ ఈ మే కి విడుదల కాబోతుంది. ఈ చిత్రంతో పాటు మరో 2 చిత్రాలని కూడా అనౌన్స్ చేసేసాడు. ఇది నిజంగా రెండో అద్బుతం అని చెప్పాలి.

ఇక అనుకోకుండా చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రంలో మహేష్ బాబు జాయిన్ అవ్వడం… మరో వింత. నిజానికి చరణ్ చేయాల్సిన ఈ పాత్ర కొన్ని కారణాల వల్ల మహేష్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ 30 రోజులు కాల్షీట్స్ ఇచ్చాడని సమాచారం. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేసిన ఈ స్టార్ హీరోలు ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతుండడం నిజంగా ఓ అద్బుతం అనే చెప్పాలి. ఇక బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ‘మహానటి’ చిత్రానికి నేషనల్ అవార్డులు తెప్పించిన దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో 350 కోట్ల బడ్జెట్ తో ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ లో ఓ సినిమా రూపొందనుండడం ఇంకో అద్బుతం అని చెప్పాలి. ఏమైనా 2020 మొదటి రెండు నెలలకే ఇన్ని అద్భుతాలు జరగడం విశేషం.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus