2023లో ఎవరేమో కానీ.. వీళ్లు అదరగొట్టాల్సిందే?

కొత్త సంవత్సరం మొదలైపోయింది. కొత్త సినిమాలు వరుస కట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. మొన్నీమధ్య వరకు గతేడాది ఆ హీరో ఇది చేశాడు, ఈ హీరో అది చేశాడు అని చదువుకున్నాం. అయితే గతేడాది సినిమాలతో అంతగా అలరించలేని వాళ్లు, ఈ ఏడాది అదరగొట్టాల్సిన వాళ్లు కొందరు ఉన్నారు. వాళ్ల గురించి ఇప్పుడు చూద్దాం. అంటే 2022లో ఫ్లాప్‌లు, అట్టర్‌ ఫ్లాప్‌లు ఇచ్చిన హీరోలు.. 2023లో భారీ హిట్‌ కొట్టి బౌన్స్‌ బ్యాక్‌ అవ్వాలి అన్నమాట.

* ‘వాట్ లగా దేంగే’ అంటూ గతేడాది ఆగస్టులో ‘లైగర్‌’గా వచ్చాడు. సినిమాకు వచ్చిన హైప్‌కి, సినిమాకు రిజల్ట్‌కి అస్సలు సంబంధం లేదు. సినిమాతో నిర్మాతలు ఎంత నష్టపోయారో తెలియదు కానీ.. విజయ్‌ మాత్రం రేసులో బాగా వెనుకబడ్డాడు. దీంతో ఈ ఏడాది భారీ హిట్‌ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన చేతిలో ఇప్పుడు ‘ఖుషి’ ఒక్కటే ఉంది. అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. మరో కొత్త సినిమా కూడా ఓపెన్‌ కాలేదు. సో విజయ్‌ బకప్‌.

* గతేడాది ‘ఆచార్య’తో డిజాస్టర్‌ను మూటగట్టుకున్నాడు చిరంజీవి. ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాకు భారీ టాక్‌ వచ్చినా.. వసూళ్లు తుస్‌ మనిపించాయి. దీంతో ఈ ఏడాది చిరు కూడా రెడీ అవ్వాల్సి ఉంది. ‘వాల్తేరు వీరయ్య’తో సంక్రాంతికే వస్తున్నాడు చిరు. ఆ తర్వాత ‘భోళా శంకర్‌’ కూడా వస్తుంది. మరి ఫలితాలు చూడాలి.

* ఇక ప్రభాస్‌ పరిస్థితి అయితే ఇంకా ఇబ్బందికరం. పాన్‌ ఇండియా హీరోగా దూసుకుపోవాల్సిన సమయంలో ‘రాధేశ్యామ్‌’ రిజల్ట్‌తో కుదేలయ్యాడు. తిరిగి పాన్‌ ఇండియా హిట్‌ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ‘ఆదిపురుష్‌’ చేసినా.. అది విమర్శలు, ఆరోపణల మధ్యలో చిక్కుకుంది. దీంతో ‘సలార్‌’ సంగతి చూడాలి.

* సినిమాలు ఫ్లాప్‌ అంటే నాని ఒప్పుకోకపోవచ్చు కానీ.. 2022లో నానికి అంత మంచి ఫలితమేమీ రాలేదు. ‘అంటే సుందరానికి’ సినిమా నానిని దెబ్బకొట్టింది. ఆ సినిమా ఎఫెక్ట్‌ నుండి నాని అర్జెంట్‌గా బయటకు రావాలి. దానికి ఆయన చేస్తున్న సినిమా ‘దసరా’. లుక్‌, ఫీల్‌ బాగుంది.. సినిమా ఎలా ఉంటుందో చూడాలంతే.

* డాక్టర్‌ – పోలీసు అంటూ.. ‘ది వారియర్‌’గా 2022లో వచ్చాడు రామ్‌. ఆ సినిమాకు జనాల నుండి సరైన స్పందన రాలేదు. దీంతో ఈ ఏడాదిలో మాంచి మాస్‌ హిట్‌ కోసం చూస్తున్నాడు. దాని కోసం బోయపాటి శ్రీను డైరక్షన్‌లో సినిమా చేస్తున్నాడు కూడా.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus