ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని అనౌన్స్ చేస్తున్నారు మేకర్స్. ఒకేసారి 4 ,5 భాషల్లో సినిమాని రూపొందించి .. మార్కెట్ చేసుకుని బిజినెస్ చేసుకోవాలి అనేది వాళ్ళ ప్లాన్. అయితే ‘ఇది పాన్ ఇండియా సినిమా’ అని కొంతమంది అనౌన్స్ చేసినప్పటికీ.. రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి తేడా వచ్చేస్తుంది. చాలా పాన్ ఇండియా ప్రాజెక్టులు ఒకేసారి అన్ని భాషల్లోనూ రిలీజ్ కావడం లేదు. ఈ లిస్ట్ లో ‘స్కంద’ వంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి.
మొదట్లో అవి పాన్ ఇండియా సినిమాలు అని అనౌన్స్ చేసి.. తర్వాత పక్క రాష్ట్రాల్లో థియేటర్లు దొరకలేదు అంటూ ఆ సినిమాలని రిలీజ్ చేయలేదు మేకర్స్. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. చాలా మంది హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేసి తమ మార్కెట్ ను పెంచుకోవాలని కష్టపడుతున్నారు. ఈ లిస్ట్ లో మిడ్ రేంజ్ హీరోలు కూడా ముందున్నారు. ఇప్పటికే ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారు పాన్ ఇండియా సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు.
మరోపక్క విజయ్ దేవరకొండ, నాని వంటి వారు కూడా పాన్ ఇండియా సినిమాలు చేశారు. నిన్న కాక మొన్న వచ్చిన తేజ సజ్జ కూడా ‘హనుమాన్’ తో పాన్ ఇండియా హిట్టు కొట్టాడు. కానీ కొంతమంది హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ కోసం ట్రై చెయ్యట్లేదు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం :
1 ) మహేష్ బాబు :
హిందీ, తమిళ భాషల్లో సూపర్ క్రేజ్ ఉన్నప్పటికీ మహేష్ బాబు ఇంకా పాన్ ఇండియా సినిమా చేయలేదు. రాజమౌళితో చేసే సినిమానే మొదటి పాన్ ఇండియా సినిమా అవుతుంది.
2 ) పవన్ కళ్యాణ్ :
ఎందుకో ఇతను కూడా ఇంకా పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ‘హరి హర వీర మల్లు’ ‘ఓజీ’ వంటివి పాన్ ఇండియా ప్రాజెక్టులుగా రూపొందుతున్నట్లు తెలుస్తుంది.
3 ) బాలకృష్ణ :
ఎందుకో బాలయ్య (Balayya) కూడా ఇంకా పాన్ ఇండియా సినిమా చేయలేదు.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!