2025 సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు వచ్చాయి. అవే ‘గేమ్ ఛేంజర్’ ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘గేమ్ ఛేంజర్’ పెద్ద బడ్జెట్ మూవీ, పాన్ ఇండియా మూవీ. ఆ సినిమా సంగతి పక్కన పెడితే. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. సీనియర్ స్టార్ హీరోల సినిమాలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు కలెక్ట్ చేసే సినిమాలు అనే పేరు సంపాదించుకున్నాయి. అయితే ‘డాకు మహారాజ్’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాల సక్సెస్లలో ఓ సిమిలర్ పాయింట్ ఉంది.
అదేంటంటే ఈ రెండు సినిమాల్లోనూ హీరోలతో పాటు చైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన పిల్లలు బాగా హైలెట్ అయ్యారు. ముందుగా ‘డాకు మహారాజ్’ సినిమా సంగతికి వస్తే.. ఈ సినిమా కథ మొత్తం ఓ పాప చుట్టూ తిరుగుతుంది. వైష్ణవి అనే పాత్ర పోషించిన చిన్నారి.. నటనకి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఆ పాప పేరు వేద అగర్వాల్ అని తెలుస్తుంది. ఈమె ఆగ్రాకు చెందిన వ్యక్తి. అయితే వీళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్లో సెటిల్ అయ్యింది.
ఈ పాప మంచి సింగర్. ఇన్స్టాగ్రామ్లో ఈ పాపకి 31 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వేద మంచి నటి మాత్రమే కాదు మంచి సింగర్ కూడా. వరుణ్ తేజ్ నటించిన ‘గాండీవ ధారి అర్జున’ సినిమాతో నటిగా మారింది వేద. ‘డాకు మహారాజ్’ ఈమెకు మంచి బ్రేక్ ఇచ్చింది అని చెప్పాలి.
ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో కూడా ఓ చిన్న పిల్లాడి పాత్రకి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బుల్లి రాజు అనే పాత్ర పోషించిన ఈ బాబు పేరు బీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. వెంకటేష్ కొడుకుగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో కనిపించాడు ఈ బాబు. అప్పట్లో మాస్టర్ భరత్ మాదిరి.. ఇప్పుడు ఈ పిల్లడు తన నటనతో మెప్పించేలా ఉన్నాడు. కచ్చితంగా ఇతనికి మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.