Game Changer: గేమ్ ఛేంజర్.. యూఎస్ మార్కెట్‌లో బిగ్ షాక్!

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా అనుకున్న స్థాయిలో యూఎస్ మార్కెట్‌ను ఆకట్టుకోలేకపోయింది. ట్రైలర్‌, ప్రమోషన్ల హడావుడి బాగానే జరిగినా, సినిమా విడుదల తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరడం అంత ఈజీగా ఉండదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. $4.5 మిలియన్‌ బ్రేక్ ఈవెన్‌ కోసం అవసరమైన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదని విశ్లేషకులు తెలిపారు.

Game Changer

ప్రస్తుతం సినిమా $1.8 మిలియన్‌ వద్ద నిలిచిపోయింది. విడుదలైన తొలి వారంలోనే భారీ తగుదల చూడాల్సి రావడం యూఎస్ మార్కెట్‌లో తీవ్ర నిరాశను కలిగించింది. ప్రత్యేక థియేటర్‌ పాసులు, అదనపు స్క్రీనింగ్‌లు ఏర్పాటు చేసినప్పటికీ ప్రేక్షకుల స్పందన అనుకున్న స్థాయిలో లేకపోవడం కలెక్షన్లపై ప్రభావం చూపింది.

సినిమా కథ, స్క్రీన్‌ప్లే మరియు నెరేషన్‌లో ఉన్న లోపాల వల్ల ప్రేక్షకులు కనెక్ట్‌ కాలేకపోయారన్నది ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గానే ఈ చిత్రాన్ని విడుదల చేసినప్పటికీ, యూఎస్‌లో అతి తక్కువ వసూళ్లు సాధించడం ఆందోళన కలిగించే అంశమని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. లేటెస్ట్ లెక్కల ప్రకారం, గేమ్ ఛేంజర్ ఈ వారం ముగిసే నాటికి అత్యధికంగా $2.2 మిలియన్ల వరకు మాత్రమే వసూలు చేసే అవకాశం ఉంది.

దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు దాదాపు 2 మిలియన్‌ డాలర్లు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది రామ్ చరణ్ కెరీర్‌లోనే కాకుండా, దిల్ రాజు ప్రొడక్షన్‌లో కూడా పెద్ద ఊహించని డిజాస్టర్ గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉన్నా, యూఎస్ మార్కెట్‌లోని ఈ ఫలితంపై పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ తన ప్రాజెక్టులపై మరింత ఫోకస్‌ పెట్టాల్సిన అవసరం ఉందని ట్రేడ్‌ అనలిస్టులు సూచిస్తున్నారు.

ఒకప్పటి హీరోయిన్ పై ఆమె మాజీ భర్త షాకింగ్ కామెంట్స్.. కూతురు కేసులు వేసిందంటూ?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus