ఈ మధ్య టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. సమ్మర్ మొదలైనప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమాలు పట్టుమని పది కూడా లేవు. వచ్చిన సినిమా వచ్చినట్టు బ్యాక్ టు పెవిలియన్ అనే బాట పడుతున్నాయి. ‘దసరా’ ‘విరూపాక్ష’ మాత్రమే ఆ సినిమాల స్థాయిలో సందడి చేశాయి. అటు తర్వాత ‘బిచ్చగాడు’ ‘మేమ్ ఫేమస్’ ‘2018 ‘ వంటి సినిమాలు పర్వాలేదు అనిపించే విధంగా కలెక్ట్ చేసి వాటి మార్కెట్ కి తగ్గట్టు బ్రేక్ ఈవెన్ సాధించాయి.
కానీ మధ్యలో రిలీజ్ అయిన సినిమాలు కానీ.. గత రెండు వారాల్లో రిలీజ్ అయిన సినిమాలు కానీ కనీసం ఒక్కరోజు .. ఒక్క షో కూడా హౌస్ ఫుల్ కాని పరిస్థితి. కనీసం హౌస్ ఫుల్ కాకపోయినా డీసెంట్ గా అయినా క్రౌడ్ పుల్లింగ్ ఉందా అంటే.. అదీ లేదు.గత రెండు వారాల నుండి ఇంకా ఘోరమైన పరిస్థితి నెలకొంది. జూన్ 2 న సెలవు ఉన్నప్పటికీ పరేషాన్,అహింస, నేను స్టూడెంట్ సార్ సినిమాలకి మినిమమ్ జనాలు కూడా రాక షోలు క్యాన్సిల్ అయ్యాయి.
నిన్న రిలీజ్ అయిన సినిమాల (Movies) పరిస్థితి ఇంకా ఘోరం. ఆంధ్ర, తెలంగాణ లో మార్నింగ్ షోలే 80 శాతం క్యాన్సిల్ అయ్యాయి అంటే అర్థం చేసుకోవచ్చు. బి,సి సెంటర్స్ లో అయితే చాలా థియేటర్లు తాత్కాలికంగా మూసేసి పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఓపెన్ చేస్తారని చెబుతున్నట్టు సమాచారం. వచ్చే వారం ‘ఆదిపురుష్’ వస్తుంది కాబట్టి.. ఆ సినిమా బాక్సాఫీస్ కు ఊపిరి పోసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!