Tollywood: టాలీవుడ్ చరిత్రను మార్చే సినిమాలేవే.. సంచలనాలను సృష్టిస్తాయా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కొన్ని సినిమాలు టాలీవుడ్ భవిష్యత్తును మార్చబోయే సినిమాలు అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులను సైతం ఆకర్షించడం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా, వార్2 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. ఈ మూడు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

ప్రభాస్ నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాలకు కళ్లు చెదిరే స్థాయిలో బిజినెస్ జరగడంతో పాటు అత్యంత భారీ స్థాయిలో ఆఫర్లు వస్తుండటం గమనార్హం. పవన్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు, పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడటం గమనార్హం. మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీపై పాన్ వరల్డ్ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీ గేమ్ ఛేంజర్, బన్నీ సుకుమార్ కాంబో మూవీ పుష్ప2 కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాల బిజినెస్ 4000 కోట్ల రూపాయల నుంచి 5500 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనుందని సమాచారం అందుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శకనిర్మాతలు భారీ బడ్జెట్ దిశగా అడుగులు పడుతుండటం గమనార్హం. ఈ సినిమాలన్నీ కచ్చితంగా సక్సెస్ సాధించాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

ఈ సినిమాలపై అంచనాలు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ దర్శకనిర్మాతలు విజువల్ ఎఫెక్స్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని విమర్శలకు ఛాన్స్ ఇవ్వవద్దని అభిప్రయాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ (Tollywood) పాన్ ఇండియా సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus