ఈ ఏడాది ఫ్లాప్ సినిమాలను మూట కట్టుకున్న స్టార్ సెలబ్రిటీస్ వీళ్ళే!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీల కెరియర్ ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. అప్పటివరకు స్టార్ సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఇండస్ట్రీకి కూడా దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటాయి.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్నటువంటి కొందరు నటీమణులకు ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదని తెలుస్తోంది.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్నటువంటి నటీమణులు ఈ ఏడాది ఫ్లాప్ సినిమాలను తమ ఖాతాలో వేసుకున్నారు. మరి ఆ హీరోయిన్స్ ఎవరో ఓ లుక్కేసేద్దాం…

పూజా హెగ్డే:

స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూజా హెగ్డే ఈ ఏడాది నాలుగు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య,సర్కస్ వంటి నాలుగు సినిమాల ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఒక్క సినిమా కూడా హిట్ కాకపోవడంతో పూజ హెగ్డే ఏకంగా ఐరన్ లెగ్ అనే ట్రోల్స్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

రష్మిక:

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న రష్మిక ఈ ఏడాది ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాలీవుడ్ డెబ్యూ మూవీ గుడ్ బై,మిషన్ మజ్ను అనే సినిమాలు పరవాలేదు అనిపించుకున్నాయి. అయితే ఈ ఏడాది రష్మికకు అనుకున్నంత స్థాయిలో కలిసి రాలేదని చెప్పాలి.

సాయి పల్లవి:

అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుని సాయిపల్లవి ఈ ఏడాది మాత్రం విరాటపర్వం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ద్వారా ఈమె తీవ్ర నిరాశను ఎదుర్కొన్నారు.

కృతి సనన్:

ఉప్పెనతో ఎంతో మంచి హిట్ అందుకున్నటువంటి కృతి సనన్ ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి చెప్పాలి.ఇలా మూడు సినిమాలు కూడా డిజాస్టర్ కావడంతో ఈ ఏడాది ఈమెకు పెద్దగా కలిసి రాలేదు.

సమంత:

సమంత నటించిన యశోద సినిమా ఈ ఏడాది విడుదలై మంచి విజయం అందుకుంది. కానీ ఈమె మాత్రం మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇలా సమంతకు ఈ ఏడాది వ్యక్తిగతంగా పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus